డ్రైఫ్రూట్స్ లడ్డును ఇలా తయారు చేసి తింటే రాత్రి మిమ్మల్ని ఎవరు ఆపలేరు.
డ్రైఫ్రూట్స్ లడ్డు.. మన శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి.. నేరుగా వీటిని తినడానికి కొంత మంది ఇష్టపడరు.. ఇలా డ్రైఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకుని తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు ప్రోటీన్స్ అందుతాయి. అయితే తయారుచేసే విధానం.. ముందుగా ఖర్జూర పండులోని విత్తనాలు తీసేసి బాదంపప్పు, పిస్తాపప్పు అన్నింటినీ పొడవైన ముక్కలుగా కోసుకోవాలి.
వీటన్నింటినీ విడివిడిగా ఉంచుకోవాలి. అంజీర్ పప్పు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక కళాయి స్టవ్‌పై ఉంచి అందులో అరలీటరు నీరు పోసి, పంచదార, బెల్లం వేసి కలుపుతూ ఉండాలి. లేతగా ఉండేలా పాకం పట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఖర్జూరం ముక్కలు వేసి రెండు నిమిషాలపాటు కలిపి కళాయిని కిందికి దింపేయాలి. మరో బాణలి స్టవ్‌పై ఉంచి అందులో నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ అన్నీ వేసి లైట్‌గా ఫ్రై చేయాలి.
తరువాత అందులో అంజీర్‌పప్పు, గసగసాలు వేసి మరో రెండు నిమిషాలపాటు వేగించి ఆ మొత్తాన్ని ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మిశ్రమంలో వేసి యాలకుల పొడి కూడా కలపాలి. కాస్త వేడిమీద ఉండగానే ఉండలుగా చుట్టుకోవాలి. అంతే ఎంతో టేస్టీ టేస్టీ డ్రైఫ్రూట్ లడ్డు రెడీ. . డ్రై ఫ్రూట్స్ శరీరానికి కావలసిన అన్ని పోషణలను అందిస్తాయి. పిల్లల ఎదుగుదలకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
డ్రై ఫ్రూట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో మరియు ఎముకలను బలోపేతం చేయడంలో మేలు చేస్తాయి. ఇవి బీపీ, డయాబెటిక్ సమస్యలను తగ్గించడంలో తోడ్పడతాయి. ఇవి ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి దారితీస్తాయి. రోగనిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. మనం రోజూ రకరకాల డ్రైఫ్రూట్స్ను తినలేం.వీటితో లడ్డూలను తయారు చేసుకుని ప్రతి రోజూ ఒకటి తినడం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు లభిస్తాయి.