Health

వీటిని ఒక్కసారి తింటే చాలు, మీ ఎముకలు దృఢంగా మారుతాయి.

డ్రై టమోటాలు అంటే ఎండిన టమాటాలు. ఎండిన టమాటాలలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిలో విటమిన్ సి, కె, నియాసిన్, కాపర్, ప్రొటీన్, మాంగనీస్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాగా మన డైట్ లో డ్రై టమాటాలు చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే మన ఆరోగ్యాన్ని కాపాడడంలో నిత్యం ఉపయోగించే కూరగాయలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.

ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కూరగాయలు మన శరీరానికి కావలసిన పోషకాలను అందించి, మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అలా మనం నిత్యం తీసుకునే కూరగాయలలో టమోటా కూడా ఒకటి. దాదాపుగా అన్ని ప్రాంతాలవారు కూడా టమాటలను తింటుంటారు. ఇక వీటితో చేసిన వంటకాల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. టమోటాలతో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

అంతేకాక శరీరానికి కావలసిన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్, సహజ చక్కెర, ఫైబర్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ ఎ, ఇ, సి, బి6, రిబోఫ్లావిన్‌ వంటి పోషకాలు టమోటాల నుంచి పుష్కలంగా లభిస్తాయి. అయితే కేవలం తాజా టమాటాల ద్వారానే కాక ఎండిపోయిన ఎమోటాల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎండిన టమాటాలలో కూడా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిలో విటమిన్ సి, కె, నియాసిన్, కాపర్, ప్రొటీన్, మాంగనీస్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

కాగా మన డైట్‌లో డ్రై టమాటాలు చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. డ్రై టమోటాలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి తీవ్రమైన ఇన్ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుంది. ఇంకా వీటి కారణంగా న్యుమోనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు తగ్గుతుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు విటమిన్‌ సి తీసుకోవడం మంచిది. టొమాటాలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

అలాగే హైపర్‌టెన్షన్‌ కారణంగా గుండె సమస్యలు, గుండె పోటు, కిడ్నీ వ్యాధులు, గుండె పోటు వంచి సమస్యలు వచ్చే ప్రమాదాలను డ్రై టమాటాలు తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే టమాటాలలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం అధిక రక్తపోటను తగ్గిస్తుంది. డ్రై టమోటాలు తీసుకోవడం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాల్షియం ఎముకల దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది గుండె కండరాలను కూడా బలపరుస్తుంది. ఎండిన టమోటాలు మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ట్రిక్‌ వంటి సమస్యలను దూరం చేస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker