Health

Drink Water: రాత్రి నిద్రలో మంచినీళ్లు తాగుతున్నారా..? దాని వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

Drink Water: రాత్రి నిద్రలో మంచినీళ్లు తాగుతున్నారా..? దాని వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

Drink Water: మీ నిద్ర 3 నుంచి 4 గంటల మధ్య మెలుకువ వస్తున్నట్లయితే.. ప్రకృతి మీకు కొంత సందేశం ఇస్తోందని మీరు అర్థం చేసుకోవాలి అని సంతోష్ కుమార్ చెప్పారు. ఈ సమయంలో నువ్వు లేవాలి అని నేచుర్ మీతో చెబుతోంది. ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. దాని ప్రయోజనాన్ని పొందడం ద్వారా మీరు జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అయితే మంచి నీళ్లు.. మన దాహాన్ని తీరుస్తాయి. రోజంతా ఆహారం తీసుకోకుండా అయినా ఉండగలం కానీ.. మంచి నీళ్లు తాగకుండా మాత్రం ఉండటం కష్టం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచినీరు తాగడం చాలా అవసరం.

Also Read : నిద్రలో మీకు అలాంటి కలలు వస్తున్నాయా..! అయితే మీకు తొందరలోనే..?

దాదాపు మనలో చాలా మంది రాత్రి పడుకునే ముందు.. బెడ్ దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకొని మరీ పడుకుంటారు. మధ్యలో మెళకువ వచ్చినప్పుడు వాటర్ తాగాల్సి వస్తే కిచెన్ దాకా వెళ్లడం ఎందుకని ముందే జాగ్రత్తగా వాటర్ బాటిల్ పెట్టుకుంటారు. ఇప్పుడనే కాదు.. పూర్వం నుంచి ఈ అలవాటు ఉంది. పడుకునే ముందు మంచం దగ్గరలో వాటర్ పెట్టుకుంటూ ఉంటారు. సాధారణంగా మంచినీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలంలో అయితే మరీ ఎక్కువగా తాగాలి. వాటర్ తాగడం వల్ల.. చాలా రకాల జబ్బులు రాకుండా దూరంగా ఉంచుతుంది. మన బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. రో

జు మొత్తంలో మనం రెగ్యులర్ గా వాటర్ తాగుతూనే ఉండాలి. కానీ.. ఏ టైంలో పడితే ఆ టైమ్ లో తాగడం మాత్రం అంత మంచిది కాదట. రాత్రి పడుకునేముందు మరీ ఎక్కువ మంచినీళ్లు తాగకూడదట. మరీ దాహంగా అనిపిస్తే.. కాస్త నోరు తడుపుకోవాలి కానీ… మరీ ఎక్కువగా తాగకూడదట. నిద్ర మధ్యలో లేచి కూడా ఎక్కువ నీళ్లు తాగకూడదట. దీని వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట. పడుకునే సమయంలో నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో టెంపరేచర్ లెవల్స్ పడిపోతాయట. దీని వల్ల చాలా ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉందట.

Also Read : పడుకునే ముందు ఈ పని చేస్తే చాలు, గాఢ ​​నిద్రలోకి జరుకుంటారు.

అందుకే.. మరీ ఎక్కువ నీరు తాగకూడదట. అంతేకాదు.. రాత్రి సమయంలో ఎక్కువ నీరు తాగడం వల్ల.. యూరిన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఊరికూరికే మూత్రానికి వెళ్లాల్సి రావచ్చు. దీని వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నిద్ర మధ్యలో లేచి పొట్ట నిండేలాగా నీళ్లు తాగితే.. చాలా వరకు నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. ఒత్తిడి లాంటి సమస్యలు, అలసిపోయినట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది. రక్త ప్రసరణ కూడా జరిగా జరగక ఇబ్బంది కలుగుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker