బాదంపాలు బయట కూల్ డ్రింక్ షాప్ ల్లో తాగుతున్నారా..?
గృహాలలో బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వరకు కలిపి తయారు చేస్తారు.మామూలుగా ఇది తెలుపు రంగులో ఉంటుంది. రుచి కొరకు ఆకర్షణ కొరకు ఇతర పదార్ధములను కలుపుట వలన రంగు మారుతుంది. వెనీలా, చక్కెరలను రుచి కోసం కలుపుతారు. అయితే మన శరీరానికి కృత్తిమంగా తయారైన ఆహార పదార్థాలతో పోలిస్తే సహజసిద్ధంగా తయారైన ఆహారపదార్థాలే ఎంతో మేలు చేస్తాయి.
బాదం పప్పు శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. బాదంను ఒక పూట నానబెట్టి పొట్టు తీసి తీసుకుంటే మరీ మంచిది. బాదంను అలా తీసుకోవడం ఇష్టం లేని వారు బాదం పాలను తీసుకోవచ్చు. బయట సూపర్ మార్కెట్ లలో మనకు విరివిగా బాదం పాలు లభిస్తాయి కానీ బాదం పాలను మనం ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకోవచ్చు. ప్రతిరోజూ కాకపోయినా వారానికి ఒకటి లేదా రెండుసార్లు బాదంపాలు తీసుకోవడం మంచిది. బాదంపాలలో మాంసకృత్తులు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.
కెలొరీలు తక్కువగా లభించే బాదంపాలలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. రోజూ బాదంపాలు తాగే వాళ్లలో కండరాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి. బాదంపాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పాలలో హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటంతో పాటు సోడియం తక్కువగా ఉంటుంది. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా బాదంపాలలో ఎక్కువగా ఉంటాయి. బాదంపాలు రోజూ తీసుకునే వాళ్లు ఆస్థియోపోరిసిస్ వ్యాధి బారిన పడరు. బాదంపాలలో గుండెకు మేలు చేసే కొవ్వులతో పాటు విటమిన్ కె పుష్కలంగా లభిస్తాయి.
షుగర్ కలపని బాదంపాలు రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ఆరోగ్య నిపుణులు బాదంపాలు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయని చెబుతున్నారు. మిఠాయిలు, ఐస్ క్రీముల తయారీలో బాదంపాలను వాడతారు. సలాడ్లు, సాస్, సూప్ లలో కూడా బాదంపాలను వాడవచ్చు. సాధారణ పాల కంటే బాదంపాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పన్నెండు గంటలు నానబెట్టిన బాదంపప్పును నాలుగు కప్పుల నీళ్లు పోసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టి పల్చని వస్త్రంలో వడబోస్తే బాదంపాలు రెడీ.