బీర్ తాగేటప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే మానేయండి. ఎంత ప్రమాదమంటే..?
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఎంతో ఇష్టమైన మద్య పానీయం ఇది. అందువల్ల కూల్ డ్రింక్ తాగినట్లుగానే.. బీర్ తాగడం హాబీగా మారిపోయింది. ఎప్పడు తాగాలనిపిస్తే.. అప్పుడు తెచ్చుకొని తాగుతుంటారు. బీరులో సాధారణంగా 5-6 శాతం ఆల్కహాల్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కానీ పదే పదే తాగుతూ.. వ్యసనంగా మారితే మాత్రం.. మీ ఆరోగ్యానికి ముప్పు కొనితెచుకున్నట్లే. బీరును ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి తీవ్రమైన హాని కలుగుతుంది.
మీరులో ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే బీరును మానుకోవాలి. లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. బీరు ఎక్కువగా తాగడం వల్ల ఆందోళనతో పాటు డిప్రెషన్ మానిఫోల్డ్ రిస్క్ పెరుగుతుంది. మీకు కూడా ఆందోళన లేదా డిప్రెషన్ అనిపిస్తే.. వెంటనే బీర్ తాగడం మానేయాలి. నిర్లక్ష్యం చేస్తే, సమస్య మరింత తీవ్రమవుతుంది. మనలో చాలా మంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి మద్యం తాగుతారు. కానీ అదే పనిగా తాగుతుంటే మాత్రం.. ఒత్తిడి తగ్గకపోగా.. మరిన్ని ఇబ్బందులు కలుగుతాయి.
మీరు జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొంటున్నా.. కాలేయ పనితీరు మందగిస్తున్నా… మద్యపానం మానేయాలి. ఆల్కహాలిక్ హెపటైటిస్ వంటి తీవ్రమైన సమస్యలను ఆల్కహాల్ కలిగిస్తుంది. దీన్ని నివారించాలంటే బీరుకు వీలైనంత దూరంగా ఉండాలి. బీర్ ఎక్కువగా తాగడం వల్ల సిర్రోసిస్ ముప్పు పెరుగుతుందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. మద్యానికి బానిసవ్వకండి. బీర్ తాగడం వల్ల బరువు వేగంగా పెరుగుతుంది. పొట పెరుగుతుంది. గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. 1 క్యాన్ బీర్‌లో దాదాపు 153 కేలరీలు ఉన్నాయి. అందువల్ల శరీర బరువు పెరిగి.. ఊబకాయానికి దారితీస్తుంది.
బరువు బాగా పెరుగుతున్నట్లుగా మీకు అనిపిస్తే.. అప్రమత్తంగా ఉండాలి. బీరుకు దూరంగా ఉండాలి. మీరు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లయితే… ఆ సమస్యను బీరు మరింత తీవ్రతరం చేస్తుంది. బీపీ పేషెంట్లు ఎలాంటి ఆల్కహాల్ డ్రింక్ తీసుకోకూడదు. ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగడం వల్ల గొంతు, నోటి క్యాన్సర్‌తో సహా అనేక రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా బీరు తాగకూడదు. అందుకే బీరును ఎక్కువగా తాగకుండా చూసుకోండి. పై లక్షణాలు కనిపిస్తే.. వెంటనే మానేయండి.