రోజు వైన్ తాగితే ఎంత మంచిదో తెలుసా..? మీ ఆయుషు కూడా పెరుగుతుంది.
మద్యపానంతో కూడా అంటే ఆల్కహాల్‌తో కూడా ఏమైనా ప్రయోజనముంటుందా అనే ప్రశ్న విన్పిస్తోంది. దీనికి సమాధానం ముమ్మాటికీ కాదనే. ఎందుకంటే ఆల్కహాల్ ఫ్రీ వైన్‌తోనే ప్రయోజనమనేది ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ లేని వైన్‌లోనే పోలిఫెనోల్స్ ఉంటాయిట. అదే సమయంలో ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ సేవిస్తే గుండెకు నష్టం కలుగుతుందట. రెడ్ లేదా వైట్‌వైన్ తాగడానికి కొరోనరీ హార్ట్ డిసీజెస్‌కు మధ్య కచ్చితంగా సంబంధముందనేది పరిశోధకుల వాదన.
అధ్యయనంలో కూడా రెండు రకాల వైన్‌లు ఈ కోరోనరీ హార్ట్ డిసీజ్‌లో సురక్షితమని తేలింది. అయితే వైన్ ద్రాక్షను పులియబెట్టి తయారు చేస్తారు కనుక వైన్ తాగటం వల్ల ఏ విధమైన అనారోగ్య సమస్యలు తలెత్తవని అందరూ భావిస్తుంటారు. అయితే వైన్ కూడా సరైన మోతాదులో పరిమితికి మించి తాగటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు కానీ,మోతాదుకు మించి తాగటం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ప్రతిరోజు మనం పరిమితికి మించి వైన్ తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తరచూ వైన్ తాగటం వల్ల గుండె జబ్బులను పూర్తిగా దూరం పెట్టవచ్చు. తరచు వైన్ తాగటం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.తద్వారా అధిక రక్తపోటు సమస్య నుంచి విముక్తి పొందడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు. పలు అధ్యయనాల అనంతరం నిత్యం పరిమిత మోతాదులో వైన్ తాగే వారిలో ఆయుష్షు కూడా ఎక్కువగా ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.
హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిర్వహించిన పలు అధ్యయనాలలో భాగంగా తరచూ వైన్ తాగటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా.. చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.ఇలా వైన్ తాగటం వల్ల త్వరగా వృద్ధాప్య ఛాయలు దరికి చేరవని నిపుణులు వెల్లడించారు. ఇక ప్రతి రోజు వైన్ తాగడం వల్ల 30% డయాబెటిస్ వచ్చే సమస్యలు కూడా తగ్గిపోతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.ఇలా ప్రతిరోజు వైన్ తాగటం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పలు అధ్యయనాల ద్వారా వెళ్లడైంది.