Health

కూల్ వాటర్ తాగడం వల్ల పొడి దగ్గు సమస్య వస్తుంది, పొడి దగ్గు తగ్గాలంటే ఏం చెయ్యాలో తెలుసా..?

చాలామంది నీళ్లను తాగడానికి బాగా కూల్ ఉన్న నీళ్లను తాగుతూ ఉంటారు. కొందరైతే బరువు తొందరగా తగ్గాలని విపరీతంగా వేడి చేసిన నీళ్ళను తాగుతారు. అయితే ఈ రెండు ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు వైద్య నిపుణులు. మనం కూల్ వాటర్ ఎందుకు తాగకూడదు అనే విషయం పైన కూడా వివరణ కూడా ఇస్తున్నారు. అయితే ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎన్నో రోగాలు కూడా వస్తాయి. రోజంతా చెమటలు పట్టడం, చర్మానికి క్రిములు అంటుకోవడంతో పాటుగా పొడి దగ్గు సమస్య ఈ సీజన్ లో ఎక్కువగా వస్తుంది.

ఎండ వేడి కారణంగా పిల్లలు, పెద్దలు తరచుగా చల్లని పదార్థాలను తింటూ ఉంటారు. అలాగే ఆరుబయట ఎక్కువ సేపు కూర్చుంటారు. వీటి ప్రభావం మొదట గొంతుపై కనిపిస్తుంది. గొంతు నొప్పి దగ్గు, జలుబు, జ్వరంగా మారుతుంది. దీని వల్ల గొంతులో పెరిగే బ్యాక్టీరియా అలసట, ఒళ్లు నొప్పులు, మరెన్నో సమస్యలను పెంచుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. పసుపు.. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

ఇలాంటి పసుపు గొంతునొప్పి, మంటను తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే కర్కుమిన్ శ్వాసకోశ వ్యాధులను కూడా నయం చేస్తుంది. పసుపును ఎలా ఉపయోగించాలి..గొంతునొప్పి రాకుండా ఉండాలంటే పాలలో చిన్న చెంచా పసుపును కలిపి తాగండి. ఇది నొప్పితో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. వేడి పానీయాలు.. ఎండాకాలంలో హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. అయితే చాలా మంది చల్లని, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండే పానీయాలను తాగుతుంటారు.

కానీ ఇవి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే వీటికి బదులుగా గోరువెచ్చని లేదా సాదా నీటిని తాగండి. అలాగే గ్రీన్ టీని రోజుకు రెండుసార్లు తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్రీన్ టీలో రోజ్మేరీ ఆకులు, పుదీనా ఆకులను కూడా వేయొచ్చు. గొంతులో పేరుకుపోయిన శ్లేష్మాన్ని తొలగించడానికి పుదీనా ఆకులు ఉపయోగపడతాయి. ఇందుకోసం ఏం చేయాలంటే..గ్రీన్ టీలో పుదీనా ఆకులను కలుపుకుని తాగితే గొంతునొప్పి సమస్య తగ్గిపోతుంది.

వీటితో పాటు అశ్వగంధ, పుదీనా ఆకులు, ములేతి, సోంపు వేసి మరిగించి తాగితే గొంతు ఇన్ఫెక్షన్ కూడా తొలగిపోతుంది. కావాలనుకుంటే దీన్ని టేస్టీగా చేయాలనుకుంటే తేనెను కలపొచ్చు. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి. ఇది గొంతులో ఉండే ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పచ్చి ఉల్లిపాయలు.. పొడి దగ్గు సమస్య ను తగ్గించుకోవాలంటే పచ్చి ఉల్లిపాయలు తినండి. పచ్చి ఉల్లిపాయలు కఫం సమస్యను తొలగించడానికి సహాయపడతాయి.

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల గొంతు సమస్య తగ్గడమే కాదు కళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఎలా తినాలి..ఉల్లిపాయ ముక్కలను మిక్సీలో గ్రైండ్ చేసి వడకట్టి ఆ రసాన్ని తాగొచ్చు. ఇది మిమ్మల్ని ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇది కాకుండా చిన్న ఉల్లిపాయ ముక్కలను నీటిలో మరిగించి వాటిని వడకట్టి గోరువెచ్చగా అయిని తర్వాత రెండు మూడు రోజులు తాగండి. జ్యూస్ తో పాటు పచ్చి ఉల్లిపాయలు కూడా తినొచ్చు. ఆవిరి పట్టండి.. పొడి దగ్గుతో పాటుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా చాలా మందికి కలుగుతుంది.

ఈ సమస్యకు చక్కటి పరిష్కారం ఆవిరి పట్టడం. ఆవిరి పట్టడం వల్ల శరీరానికి త్వరగా ఉపశమనం కలుగుతుంది. దీని కోసం ఒక గిన్నెలో నీటిని వేడి చేసి అందులో కొద్దిగా ఉప్పు వేసి ఆవిరి పట్టండి. ఇది మీ శరీరానికి ఎలాంటి హాని కలిగించదు. ఇది కాకుండా మీరు స్టీమర్లో డాక్టర్ సూచించిన ద్రవ మందులతో కూడా ఆవిరి తీసుకోవచ్చు. ఎండాకాలంలో గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న తులసి, వేప ఆకులను వేసి ఆవిరి పట్టొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker