Health

చెవి దగ్గర ఇలా ఉంటే.. మీకు తొందరలోనే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అయితే అమెరికాన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం గుండెపోటు లక్షణాలు స్త్రీలు, పురుషులకు వేరువేరుగా ఉంటాయి.

అయితే ఇద్దరిలో ఒక లక్షణం మాత్రం కచ్చితంగా ఒకేలా ఉంటుంది. అది ఛాతీనొప్పి లేదా ఛాతీలో అసౌకర్యం. స్త్రీలలో శ్వాస అందకపోవడం, శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది పడడం, వాంతులు, వికారం, దవడ లాగడం లేదా నొప్పి పెట్టడం, వెన్నులో నొప్పి కూడా కనిపిస్తాయి. చెవిలో లక్షణం…గుండె పోటు చెవి ద్వారా కూడా సంకేతాన్ని పంపిస్తుంది. ఇది స్త్రీ, పురుషులు ఇద్దరిలో కనిపిస్తుంది. ఈ అసాధారణమన సంకేతాన్ని ‘ఫ్రాంక్స్ సైన్’ అని పిలుస్తారు.

చెవి కింద మెత్తగా ఉండే ప్రాంతాన్ని ‘ఇయర్ లోబ్’ అంటారు. ఇక్కడే అమ్మాయిలు రంధ్రం చేసి చెవిరింగులు పెట్టుకుంటారు. ఈ లోబ్ కాస్త నొత్త పడినట్టు వంపు తిరిగి ఉన్నట్టు కనిపిస్తే గుండె పోటు వచ్చే అవకాశం ఉన్నట్టు భావించాలట. ఇయర్ లోబ్ ఆకారంలో మార్పు రావడం అనేది అకాల వృద్ధాప్యాన్ని సూచిస్తుంది. అలాగే చర్మ, గుండె సంబంధిత జబ్బులతో సంబంధం కలిగి ఉన్నట్టు ఆరోగ్య అధ్యయనాలు చెబుతున్నాయి.

వీరిలోనే ఎక్కువ.. గుండె పోటు వచ్చే అవకాశం 45 ఏళ్లకు మించిన వయసున్న మగవారిలో, 55 ఏళ్లు దాటినా ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. అలాగే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా గుండెపోటుకు గురయ్యే ఛాన్సులు ఎక్కువ. ఏటా సంభవిస్తున్న మరణాల్లో 31 శాతం గుండె వ్యాధుల వల్లే. ఈ గణాంకాలు చూస్తుంటే గుండెవ్యాధులు ఎంతగా జనాల ప్రాణాలు తీస్తున్నాయో అర్థమవుతుంది. మద్యం తాగే అలావాటు ఉంటే వీలైనంతవరకూ తగ్గించుకోవడం మంచిది. వ్యాయామం, మంచి జీవనశైలీ వల్ల ఎన్నో సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker