Health

ఈ విషయం తెలిస్తే బిర్యానీ తినాలంటే భయపడతారు.

ఆహారం మంచి రంగులో కనిపించేందుకు ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి వంటల తయారీలో విచ్చలవిడిగా ఎసెన్సులు, ఇతర రంగులను వాడుతున్నారు. హోటళ్లు, సూపర్‌ మార్కెట్లు, బేకరీల్లో ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో విచ్చలవిడి రంగుల వాడకం బయట పడింది. అయితే హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో సంచార ప్రయోగశాలను ఇటీవల జీహెచ్ఎంసీ ప్రారంభించింది.

ఇందులో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లు, తోపుడు బండ్లు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అందులో నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. వారు వాడే పదార్థాలు చూసి ఆశ్చర్యపోయారు. అధికారులే విస్మయం చెందారు. ఇంత దారుణమైన కల్తీ పదార్థాలు వాడితే ఆరోగ్యం పాడైపోవడం ఖాయమని చెబుతున్నారు. పొరపాటున కూడా బయట తిండ్లు మంచివి కాదని తేల్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు వంద చోట్ల తనిఖీలు చేయగా చాలా చోట్ల కల్తీ వాటిని వాడుతున్నట్లు తేలింది. దీంతో ప్రజలు చైతన్యం తెచ్చుకుని బయట తిండ్లకు ఆకర్షితులు కావద్దని సూచిస్తున్నారు.

బిర్యాణీలు అయితే లెక్కలేనన్ని అమ్ముతున్నారు. అందులో వాడే వాటిని చూస్తే భయం కలిగిస్తోందని చెబుతున్నారు. జర జాగ్రత్త సుమా. బయట తిండ్లకు విరామం ఇవ్వండి. ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమం. ఆరోగ్యానికి ఆరోగ్యం శుభ్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బీ కేర్ ఫుల్ హోటళ్ల ఫుడ్స్ కు టాటా చెప్పేయండి. ఇప్పటికే చాలా సర్వేలు కూడా తెలియజేశాయి. హోటళ్లలో తినడం సురక్షితం కాదని తేల్చేశాయి. ఇప్పుడు తనిఖీల్లో బయట పడిన సందర్భంలోనైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కల్తీ నూనె వాడటంతో పదార్థాలు విషతుల్యంగా మారే సూచనలున్నాయి. వాడిన నూనెనే మళ్లీ వాడుతుంటారు. దీంతో క్యాన్సర్ ముప్పు ఏర్పడుతుంది. నూనెను ఒకసారి వేడి చేస్తే దాన్ని పక్కన పెట్టాలి. కానీ వారు అలా కాదు. ఒకసారి వేడి చేసిన నూనెను పదేపదే అందులోనే కాల్చుతూ వంటలు చేస్తుంటారు. దీంతో మనకు ఎంతో నష్టం కలుగుతుందని భావించుకోవాలి. బిర్యాణీకు ఆకర్షితం కాకుండా ఇంట్లోనే తయారు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker