అప్పుడప్పుడు పచ్చి క్యారెట్స్ తింటూ ఉండాలి. ఎందుకంటే..?
క్యారెట్‌లో ప్రోటీన్లు, బీటా కెరోటిన్, కెరోటీనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి చూపు మెరుగుపరచడమే కాదు.. పలు రకాల వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. క్యారెట్‌లో ఫాల్కారినోల్ అనే శక్తివంతమైన కాంపౌండ్ ఉంది. ఇది ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి తోడ్పడుతుంది. అలాగే ఈస్ట్రోజెన్ స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు దోహదపడుతుంది.
అయితే హార్మోన్స్ బ్యాలెన్స్..పచ్చి క్యారెట్ తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ మనకు ఎంతో సహాయం చేస్తుంది. హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి పచ్చి క్యారెట్లు సహాయపడుతాయి చెడు బ్యాక్టీరియాని తొలగించడానికి కూడా ఉపయోగపడతాయి. విటమిన్ ఏ అందుతుంది..పచ్చి క్యారెట్స్ ని తినడం వల్ల విటమిన్ ఏ పొందొచ్చు. దీంతో చక్కటి ప్రయోజనాలను పొందడానికి అవుతుంది.
క్లియర్ స్కిన్ ని పొందొచ్చు.. పచ్చి క్యారెట్ తినడం వల్ల మంచి స్కిన్ ని కూడా పొందొచ్చు. ఇది ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. అలానే యాక్ని సమస్య కూడా ఉండదు. కాబట్టి రోజూ పచ్చి క్యారెట్ ని తీసుకుంటే అందమైన చర్మాన్ని పొందడానికి అవుతుంది, థైరాయిడ్ బాలెన్స్డ్ గా ఉంటుంది.. పచ్చి క్యారెట్లను తినడం వల్ల థైరాయిడ్ కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది హైపో థైరాయిడిజం తో బాధపడేవారు పచ్చి క్యారెట్ ని తింటే ఎంతో మంచిది.
ఈస్ట్రోజన్ తగ్గుతుంది..అధికంగా ఈస్ట్రోజన్ ఉంటే క్యారెట్లు తినడం వల్ల అది తగ్గుతుంది చూశారు కదా పచ్చి క్యారెట్స్ ని తినడం వల్ల ఎన్ని లాభాలు పొందొచ్చు అనేది. మరి రెగ్యులర్ గా పచ్చి క్యారెట్లను తీసుకుని ఆరోగ్యంగా ఉండండి.