ఆదివారం వస్తే చికెన్ తింటున్నారా..? ఈ విషయాలు తెలిస్తే..?
చికెన్ అనేది జంతు ఆధారిత ప్రొటీన్‌కు మూలం. శాఖాహారులతో పోలిస్తే రోజూ చికెన్ తినేవారి BMI అధికంగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు..చికెన్ శుభ్రంగా కడిగి, బాగా ఉడికించకపోవటం వల్ల కూడా అనారోగ్య సమ్యలు తప్పవు. ఇలాంటి చికెన్‌తో ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే అవకాశం ఎక్కువ. వండని చికెన్ పై సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టిరియాలు ఉంటాయి. చికెన్‌ను ముట్టుకుంటే మన చేతులకు అంటుకుని పొట్ట లోనికి చేరే అవకాశం ఉంది.
అలాగే సరిగా ఉడికించకపోయినా ఈ బ్యాక్టరియా శరీరంలోకి చేరి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. గర్భిణిలకు ఇది చాలా ప్రమాదకరం. అయితే చికెన్ ని కొన్ని పదార్థాల తో కలిపి తినడం వల్ల చెడు ప్రభావం పడుతుందని తెలియజేస్తున్నారు. ఇది శరీరంలో అలర్జీ అలాంటి వాటికి కారణం అవుతూ ఉంటుంది. ఇంకా త్రీవరమైన వ్యాధులు కూడా కలిగిస్తూ ఉంటుంది. చికెన్, చేప.. చేపలు తో చికెన్ తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. చికెన్, చేపలు రెండిట్లో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఈ రెండిట్లోనూ ఎన్నో రకాల ప్రోటీన్లు ఉంటాయి.
ఈ ప్రోటీన్ శరీరంపై ప్రతి చర్యకు కారణం అవుతూ ఉంటుంది. దీని వలన అలర్జీ లాంటి సమస్యలతో పాటు శరీరానికి హాని కలుగుతుంది. కాబట్టి చేపలు చికెన్ కలిపి తీసుకోవడం అస్సలు మంచిది కాదు. పెరుగు, చికెన్, చల్లని పదార్థాలు : కొందరు ప్రతిదానికి పెరుగు వేసుకొని తింటూ ఉంటారు. సహజంగా పెరుగు రుచిని పెంచుతుంది. ఆరోగ్యానికి కూడా మంచి చేస్తూ ఉంటుంది. చాలా మంది చికెన్ తో పెరుగు కూడా తింటూ ఉంటారు. పెరుగు ప్రభావం చల్లగా ఉంటుంది. కానీ చికెన్ ప్రభావం వేడిగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు చికెన్ పెరుగు కలిపి తీసుకోవడం జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది.
కాబట్టి చికెన్, పెరుగు కలిపి తీసుకోవడం సాధ్యమైనంత వరకు మానుకోవాలని తెలియజేస్తున్నారు. పాలతో చికెన్.. చికెన్ పాలతో తీసుకోవడం అస్సలు మంచిది కాదని విషంలా వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు. చికెన్ పాలు కలిపి తీసుకుంటే శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. ఈ కారణంగా శరీరంలో అలర్జీలు సంభవించి అవకాశం బాగా ఉంది. చికెన్ పాలు కలిపి తింటే చర్మ సమస్యలు అధికమవుతాయి. పాలతో చికెన్ తీసుకోవడం వలన చాలామందికి దద్దుర్లు, తెల్ల మచ్చలు, దురద లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.