Health

మీరు ఈ పండ్లు తరచూ తింటే రక్తంలో గడ్డలు వెంటనే కరిగిపోతాయి.

రక్తం గడ్డకట్టకముందు గడ్డకట్టించే ద్రవపదార్థాన్ని ప్లాస్మా అంటారు. ఇది లేత పసుపు రంగులో ఉంటుంది. ప్లాస్మాలో 90 శాతం నీరు ఉంటుంది. ప్లాస్మా రక్తంలో 60 శాతం ఉంటుంది. ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఆల్బిమిన్లు, గ్లోబ్యులిన్స్‌ అనే ప్రొటీన్‌లు ఉంటాయి. అయితే గాయం తగిలినప్పుడు రోగనిరోధక వ్యవస్థ చూపించే ఒక ప్రతి స్పందన. ఇది కణాలను ఒకదానితో ఒకటి కలిపి రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. ఈ గడ్డలు కాసేపటి తరువాత సహజంగా కరిగిపోతాయి.

అయితే అవి కరగక పోతే మాత్రం చాలా ప్రమాదం. బ్రెయిన్ స్ట్రోక్, గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ధమనుల్లో రక్తం ఎక్కువసేపు గడ్డకడితే ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి. రక్తం గడ్డలను సహజంగా కరిగించే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిని తినడం వల్ల గడ్డలు కరిగిపోతాయి. కొన్ని రకాల పండ్లలో బ్రోమెలిన్, రుటిన్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో గడ్డలను సహజంగా కరిగిస్తాయి. ఆపిల్, నారింజ, నిమ్మ, కివీ, ద్రాక్ష పండ్లు, ఈ పండ్లు తినడం వల్ల రక్తం గట్ట కట్టిని త్వరగా కరిగిపోతాయి.

కూరగాయలు..పండ్లలోనే కాదు కొన్ని రకాల ఆకుకూరలు, కూరగాయల్లో కూడా రక్తం గడ్డకట్టేలా చేసే ఎంజైమ్‌లు ఉంటాయి. ఉల్లిపాయలు, పైనాపిల్స్‌లో కూడా బ్రోమెలిన్ సమృద్ధిగా దొరుకుతుంది. ఇందులోని ప్రొటీన్-డైజెస్టింగ్ ఎంజైమ్ ప్రో-ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. అలాగే మరికొన్ని రకాల్లో కూడా బ్రోమోలిన్ అధికంగా ఉంటుంది. పాలకూర, వెల్లుల్లి, రెడ్ వైన్, కాలె, రక్తం గడ్డకట్టడాన్ని ఎలా నివారించాలి, రక్తం గడ్డకట్టడానికి చాలా మంది పసుపును గాయానికి పెట్టుకుంటారు. కానీ పసుపు ఆహారంలో చేర్చుకున్నా చాలు. ఇందులో కర్కుమిన్ ఆరోగ్యంపై యాంటీ ఆక్సిడెంట్, యాంటీ కార్సినోజెనిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

అతిగా నిద్రపోతే..అతిగా నిద్రపోయే వారిలో రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువసేపు కదలకుండా ఒకేచోట కూర్చోవడం వల్ల రక్తం గడ్డ కట్టడం ఎక్కువవుతుంది. ఇలా జరుగడం వల్ల ఊపిరితిత్తులు లేదా గుండెలో పల్మోనరీ ఎంబోలిజం పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల శ్వాస ఆడకపోవుట, మెడ, ఛాతీ, వెన్ను, చేయిలో అసౌకర్యంగా అనిపించడం, ఛాతీలో నొప్పి రావడం జరుగుతుంది. అందుకే రక్తంలో గడ్డలు కట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. రక్తం గడ్డ కట్టడం వల్ల ఒక్కోసారి గుండెకు, మెదడుకు కావాల్సినంత రక్తం చేరదు. దీనివల్ల గుండెపోటు, స్రోక్ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker