మల్బరీ తినడం వల్ల ఈ వ్యాధులు తగ్గి ఆ సామర్థ్యం భారీగా పెరుగుతుంది.
మల్బరీ.. రెగ్యులర్ గా తీనడం వల్ల బరువు కూడా నియంత్రణనలో ఉంటుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థ మెరుగుపడి, ఎముకలు దృఢంగా మారుతాయి. అంతే కాదు హైబీపీ సమస్యలతో బాధపడుతున్న వారు దీన్ని తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే . ముఖ్యంగా ఇటువంటి పోషకాలు పండ్లలోనే ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధులతో పోరాడుతాయి. అంతేకాకుండా ముందస్తుగా వ్యాధులు దరి చేరకుండా చేస్తాయి.
ఇలాంటి మల్బరీ ఒకటి. ఇందులో ఎన్నో పోషక గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తినడానికి పుల్లగా, రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉంటాయి. ఇవి ద్రాక్ష పండులా ఉంటాయి. ఈ పండు విటమిన్లకు మంచి మూలం అనే చెప్పాలి. మధుమేహం.. మధుమేహ రోగులకు మల్బరీ దివ్యౌషధం. టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారికి ఇవి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి.
అలాగే మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారు మల్బరీని తీసుకోవాలి. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గించే ప్లాస్మా గ్లూకోజ్‌ని పెంచుతుంది. ఇది శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్‌కు మేలు చేస్తుంది.. మల్బరీలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. అలాగే క్యాన్సర్ ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించే అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. మల్బరీ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి మొక్కల ఉత్తమ సమ్మేళనాలు ఇందులో కనిపిస్తాయి. ఇది క్యాన్సర్ కణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
కళ్లకు ఉపయోగపడుతుంది.. మల్బరీ మన కంటి చూపునకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. ఇది నేరుగా మన కళ్లను ప్రభావితం చేస్తుంది. ఇది రెటీనాకు హానిని నివారిస్తుంది. కంటిశుక్లం వంటి వ్యాధులలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చాలా పరిశోధనలలో రుజువైంది.