ఈ కాలంలో రేగిపండ్లు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకోండి.

ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. ఎముకలు దృఢంగా వుండేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఎముకల్ని బలహీన పరిచే ఆర్థరైటిస్ సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే, వారికి ఈ పండ్లు తినడం మంచిది. అయితే చిన్న గోలీలంత ఉండే రేగు పండ్లను చూసి చాలా మంది తినడానికి ఇష్టపడరు. అవి తాజాగా లేవనీ, అందంగా లేవనీ, పుచ్చులు ఉంటాయనీ.. ఇలా రకరకాల కారణాలతో దూరం పెడతారు.

కానీ.. వాటి విశేషాలు తెలిస్తే.. తప్పక తింటారు. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రేగుపండ్లు యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగివున్నాయి. ఇవి శరీరంలో నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ముసలివారు ఈ పండ్లను తప్పక తినాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి రేగుపండ్లు ఎంతో మేలు. అడవుల్లో కాసే ఈ పండ్లలో ఫైటోకాన్‌స్టిట్యూయెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.

ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె సరిగా పనిచేసేలా చేస్తాయి. చలికాలంలో గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్స్ ఎక్కువగా వస్తుంటాయి. అవి రాకూడదంటే.. రేగు పండ్లు తినాలి. కంటి సమస్యలు ఉన్నవారు రేగు పండ్లను తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు రకరకాల కంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. తద్వారా దృష్టి మెరుగవుతుంది.

మలబద్ధకంతో బాధపడేవారికి రేగు పండ్లు సరైన మందు. ఇవి పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది ప్రేగుల కదలికను పెంచుతాయి. తిన్న ఆహారం బాగా అరుగుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి రేగు పండ్లు తినడం ప్రయోజనకరం. వీటిలోని నైట్రిక్ యాసిడ్.. రక్తకణాలు ఆరోగ్యంగా ఉండేలా చేసి.. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

రేగుపండ్లు మరీ ఎక్కువ తింటే వేడి చేస్తాయి. కాబట్టి లిమిట్‌గా తినాలి. ఐతే.. అధిక బరువు ఉన్నవారు, శరీరంలో చెడు కొవ్వు నిల్వలు ఎక్కువగా ఉన్నవారు.. రేగు పండ్లు తినడం మేలు. ఇవి చెడు కొవ్వును వేగంగా కరిగిస్తాయి. బాడీలో వేడిని బాగా పెంచుతాయి. వర్కవుట్లు చెయ్యకుండానే సన్నగా అయ్యేలా చెయ్యగలవు ఈ పండ్లు.