Health

ఉప్పు ఎక్కువగా తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా..? అసలు విషయం తెలిస్తే..?

ఏ ఊరిలో, ఏ కాలని చూసినా, పది పాతిక మంది ఈ సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. కాదనలేని వాస్తవం ఇది. మరి ఎప్పుడైనా భయపడ్డారా. మీకు కూడా కిడ్నీల్లో రాళ్ళు వస్తే ఏంటి పరిస్థితి. అసలు ఇంతమంది ఎందుకు ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు మన శరీరాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా మనం అనేక హానికరమైన వ్యాధులకు గురవుతాం. ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్లు సమస్య ఈ మధ్య కాలంలో అందరినీ వేధిస్తుంది. అధికంగా పని గంటలు, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడంతో సమస్య మరింత పెరగుతుంది.

కిడ్నీ స్టోన్స్ విపరీతమైన కడుపు నొప్పితో బాధపడే అవకాశం ఉంటుంది. అయితే కిడ్నీలో రాళ్లతో బాధపడుతూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ధీర్ఘకాలికంగా కిడ్నీల్లో రాళ్లు ఉంటే కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంటున్నారు. అలాగే మూత్ర విసర్జన సమయంలో నొప్పి, ఎక్కువ సార్లు మూత్రం రావడం, కడుపులో నొప్పి, ఆకలి లేకపోవడం, వికారం, జ్వరం వంటివి కిడ్నీల్లో రాళ్ల సమస్యలకు లక్షణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు.

అందుకే రాళ్ల సమస్య ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఉప్పు అధికంగా తినడం.. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉప్పు అధికంగా ఉంటే కిడ్నీల్లో రాళ్ల సమస్య పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు అధికంగా తీసుకుంటే మూత్రంలో కాల్షియం మొత్తాన్ని పెంచుతుందని, ఇది కిడ్నీల్లో రాళ్ల సమస్యకు కారణం అవుతుందని పేర్కొంటున్నారు. కాబట్టి ఉప్పు వాడకం విషయంలో జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు.

శీతలపానియాలకు దూరం..చాలా మంది కిడ్నీల్లో సమస్యలున్న రోగులు డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి వీరు అధికంగా నీరు తాగడం మంచిది. శీతల పానియం తాగడం వల్ల ముందుగానే దాహం తీరిపోయి నీటిని తక్కువగా తాగుతాం. అలాగే కొన్ని రకాల శీతలపానియాల్లో ఉండే కెఫిన్ కూడా రాళ్ల సమస్యను పెంచుతుందని, కాబట్టి వాటికి దూరంగా ఉంటేనే మేలని నిపుణుల వాదన.

నాన్ వెజ్ కు దూరం.. మాంసం, చేపలు, గుడ్లు వంటి మాంసాహార పదార్థాల్లో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ఇది కిడ్నీ స్టోన్ రోగులకు మంచిది కాదు. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్న ఆహారం ప్రోటీన్లు తక్కువుగా ఉండేలా చూసుకోవడం ఉత్తమం. టమాట.. టమాటాను ఈ మధ్య ప్రతి కూరలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్న టమాటాకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. టమాటాల్లో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. కాబట్టి కిడ్నీ రాళ్లు ఉన్న టమాటాను అస్సలు తినకూడదు. తప్పనిసరై కూరల్లో టమాటాను వినియోగించాల్సి వస్తే దాని గింజలు తీసేసి వాడుకోవడం మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker