ఈ కాయ మీరు తరచూ తింటే జీవితంలో గుండె సమస్యలు రానేరావు.
భారతదేశంలో జన్మించిన అర్జున చెట్టు సాధారణంగా నదులు, ప్రవాహాల సమీపంలో దొరుకుతుంది. ఇది 25 నుంచి 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అర్జున బెరడు నునుపుగా, బూడిద రంగులో ఉంటుంది. కానీ మధ్యలో కొన్ని ఆకుపచ్చ, ఎరుపు మచ్చలు కలిగి ఉంటుంది. అర్జున ఆకులు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. మే నుంచి జూలై నెలల్లో ఈ చెట్టుకు తెల్లటి పుష్పాలు వికసిస్తాయి. అర్జున పండు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది.
పక్వానికి చేరినప్పుడు ముదురు గోధుమ రంగులోకి మారుతుంది. అయితే అర్జున ఫలంతో చాలా లాభాలున్నాయి. ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలున్నాయి. ఇప్పట్నించే మీ డైట్‌లో అర్జున ఫలాన్ని భాగంగా చేసుకుంటే..వివిధ రకాలుగా మీరు ఫిట్‌గా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. మీ గుండెను పదిలంగా ఉంచడమే కాకుండా..మీ ఎముకల్ని బలంగా ఉంచుతుంది. గుండెకు కూడా ఇది చాలా మంచిది. అర్జున ఫలంతో గుండె కండరాలు బలోపేతమవుతాయి.
అర్జున ఫలంలో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చాలా సమస్యలకు పరిష్కారం సూచిస్తాయి. అర్జున వృక్షం బెరడు, ఆకులు, పండ్లు, వేర్ల ఉపయోగాలు వింటే వెంటనే మీరు మీ డైట్‌లో చేర్చుకుంటారు. ఆరోగ్యపరమైన చాలా రకాల సమస్యలకు ఇది ఓ మంచి పరిష్కారం. ఎముకల్ని బలంగా ఉంచేందుకు అర్జున ఫలం ఉపయోగపడుతుంది. ఎముకల్లో తరచూ నొప్పులతో బాధపడేవారు అర్జున ఫలం తప్పకుండా తీసుకోవాలి.
మరోవైపు చర్మానికి కూడా సంరక్షణ కల్గిస్తాయి. ఎవరికైనా స్కిన్ ఎలర్జీలుంటే..అర్జున ఫలంతో దూరం చేసుకోవచ్చు.కడుపుకు సంబంధించిన పలు రుగ్మతలకు అర్దున ఫలం చాలా మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కడుపులో గ్యాస్ పేరుకుపోవడం లేదా ఆహారం జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు దూరమౌతాయి.