వీటిని తరచూ తింటే నరాలు, మెదడుకు సంబంధించి సమస్యలూ జీవితంలో రావు.
నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము, ఇంద్రియ అవయవాలు, ఈ అవయవాలను శరీరంలోని మిగిలిన భాగాలతో కలిపే అన్ని నరాలు ఉంటాయి. ఈ అవయవాలు శరీరం యొక్క నియంత్రణ, వాటి భాగాల మధ్య జరిగే క్రియలకు పని చేస్తాయి. అయితే ఈ విటమిన్ బి12 నే కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే విటమిన్. ఈ విటమిన్ మన శరీరంలో సహజంగా తయారుచేయబడనప్పటికీ…
దీన్ని ఎన్నో ఆహారాల ద్వారా పొందొచ్చు. మాంసాహారులు, శాఖాహారులు అంటూ తేడా లేకుండా ఇద్దరికీ ఈ విటమిన్ చాలా అవసరం. సాక్కీ సాల్మన్, సిర్డినెస్, రెయిన్ బో ట్రౌట్, ట్యూనా వంటి చేపల్లో విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది. ఇది మన మెదడును, నాడీ కణాలను క్రమబద్దంగా ఉంచడానికి సహాయపడుతుంది. నిజానికి ఈ ఆహారాల్లో విటమిన్ బి12 తో పాటుగా దాదాపు అన్ని రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, భాస్వరం, విటమిన్ ఎ, విటమిన్ బి3, సెలీనియం లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
ఈ సీఫుడ్స్ మీకు ఉత్తమ పోషణను అందిస్తాయి. క్లామ్స్ లో మంచి ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. వీటిద్వారా ఒక్క విటమిన్ బి 12 మాత్రమే కాదు.. ఎన్నో రకాల ఇతర ప్రోటీన్లు ఉంటాయి. దీనిలో పెద్ద మొత్తంలో ఇనుము, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి12 కోసం జంతు ఉత్పత్తులు, సీఫుడ్స్, చికెన్, గొర్రె, మేక వంటి సన్నని మాంసాన్ని ఎంచుకోవడం మంచిది. ఇవి మీ శరీరంలో విటమిన్ బి12 లోపం వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయడతాయి.
అలాగే వీటి ద్వారా మీ శరీరానికి ఇనుము, జింక్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, నియాసిన్ వంటివి అందుతాయి. ఇవి గుండెకు సంబంధించిన సమస్యలు పెరగకుండా చూస్తాయి. అలాగే మీ శక్తి స్థాయిలను పెంచుతాయి. వెబ్ ఎమ్ డి ప్రకారం… ఒక ఉడకబెట్టిన గుడ్డులో 0.6 మైక్రోగ్రాముల విటమిన్ బి12 ఉంటుంది. ఈ విటమిన్ బి12 ఎక్కువ భాగం పచ్చసొనలోనే ఉంటుంది. అందుకే గుడ్డును పచ్చసొనతో సహా తినడం మంచిది. గుడ్లు ప్రోటీన్లకు, ఖనిజాలకు మంచివి వనరు.
వీటిలో ఉండే విటమిన్ బి2, విటమిన్ బి 12 లు మీ ఆరోగ్యానికి చాలా అవసరం. పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. వీటిలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ డి, పొటాషియం, జింక్, కోలిన్ కూడా ఉంటాయి. ఇవన్నీ మన శరీరాన్ని ఎంతో అవసరం. మొక్కల ఆధారిత ఆహారంలో బచ్చలికూర, బటర్నట్ స్క్వాష్, బీట్ రూట్, బంగాళాదుంప, పుట్టగొడుగులు విటమిన్ బి12 కు మంచి వనరులు. ఏదేమైనా కూరగాయల వనరుల నుంచి పోషకాల మొత్తాన్ని పొందే అవకాశం తక్కువే.