Health

నిద్రపోయేటప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..?

నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు. అయితే నిద్రలో ఒక్కొక్కరు ఒక్కో భంగిమలో పడుకుంటారు. కొంతమంది నిద్రపోయే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన అలవాటు ఉంటుంది. అయితే మీరు తరచుగా గుండెల్లో మంట, అసిడిటీతో బాధపడుతుంటే, నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిది. ఈ స్థితిలో జీర్ణాశయాన్ని, అన్నవాహికను కలిపే స్పింక్టర్ కి కొంచెం కిందుగా జీర్ణాశయం ఉంటుంది.

అందువల్ల ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణాశయంలోని పదార్థాలు, యాసిడ్ వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల అసిడిటీ సమస్య రాదు. కాలేయం శరీరం కుడి వైపున ఉంటుంది. కాబట్టి కుడివైపు తిరిగి పడుకుంటే దీనిపై ఒత్తిడి పడుతుంది. శరీరంలోని టాక్సిన్స్ లివర్ ని ఎక్కువగా చేరేందుకు ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఎడమవైపు తిరిగి పడుకుంటే శరీరంలోని హానికర పదార్థాలు, టాక్సిన్స్ కాలేయం పై భారం వేయకుండా నివారించవచ్చు. గుండె ఎడమవైపు భాగం ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని తీసుకుని మిగిలిన శరీర భాగాలకు పంపిస్తుంది.

అందువల్ల ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గుండె పంపింగ్ సామర్థ్యం మెరుగవుతుంది. ఎడమవైపు తిరగడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ పనితీరుపై ప్రభావం పడుతుంది. దీంతో ఎడమవైపు ఉన్న మహాధమని, కిందివైపు శరీర భాగాల నుంచి డీఆక్సిజినేటెడ్ బ్లడ్ ని తీసుకువచ్చే పెద్ద సిర అయిన ఇన్ ఫీరియర్ మెరుగవుతుంది. ఇధి వెన్నుకు కుడి భాగంలో ఉంటుంది. నిపుణులు చెబుతుంటారు మన శరీరంలో శోషరస వ్యవస్థ హానికర పదార్ధాలను, విష పదార్థాలను తొలగిస్తుందట.

శోషరస వ్యవస్థలో అతి పెద్ద నాళమైన థొరాసిక్ డక్ట్ మనకు ఎడమ వైపున ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాలకు కొవ్వులు, ప్రొటీన్లు, ఇతర ముఖ్యమైన పదార్థాలను పంపిస్తుంది. అందువల్ల ఎడమ భాగంలో ఉన్న కణాలు పోషకాలను మరింత వేగంగా పొందడానికి వీలు కలుగుతుంది. శోషరస వ్యవస్థలో అతిపెద్ద అవయవం స్ప్లీన్ ఇది కూడా శరీరం ఎడమ వైపున ఉంటుంది. ఎడమవైపు తిరిగి పడుకోవటం వల్ల స్ప్లీన్ కి రక్తప్రసరణ ఎక్కువ జరిగేలా చేస్తుంది. అందువల్ల ఇది మలినాలను మరింత వేగంగా ఫిల్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎడమవైపు నిద్రించడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker