Egg: రోజూ గుడ్డు తింటే.. నిజంగా అది పెరుగుతుందా..? డాక్టర్స్ ఏం చెప్పారంటే..?

Egg: రోజూ గుడ్డు తింటే.. నిజంగా అది పెరుగుతుందా..? డాక్టర్స్ ఏం చెప్పారంటే..?
Egg: గుడ్లలో ఉండే ప్రోటీన్, విటమిన్స్, ఖనిజాలు కండరాలని నిర్మించడం దగ్గర్నుంచీ బ్రెయిన్ పనితీరు మెరుగ్గా మార్చడం వరకూ ఎన్నో లాభాలని అందిస్తుంది. అయితే మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్కొలెస్ట్రాల్ అనేది మన శరీరానికి శత్రువేమీ కాదు, అది మనకు అవసరమైన ఒక ముఖ్య పదార్థం. కణాల నిర్మాణం, విటమిన్ల ఉత్పత్తిలో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే, కొలెస్ట్రాల్‌ను రక్తం ద్వారా రవాణా చేసేవి రెండు రకాలు. ఒకటి LDL, దీన్నే చెడు కొలెస్ట్రాల్ అంటారు.
Also Read: ఈ మొక్కతో తింటే చాలు, స్త్రీ, పురుషులిద్దరికీ వెయ్యి ఏనుగుల బలం వస్తుంది.
ఇది రక్తనాళాల్లో పేరుకుపోయి, వాటిని బ్లాక్ చేస్తుంది. దీనివల్ల గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుంది. అదే సమయంలో, HDL అంటే మంచి కొలెస్ట్రాల్ రక్తంలోని ఈ చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్లినికల్ డైటీషియన్ ఖుష్మా షా ‘హెల్త్ షాట్స్’ పోర్టల్‌కు చెప్పినట్లుగా, కొలెస్ట్రాల్‌ను పూర్తిగా దూరం పెట్టడం కాదు, ఈ రెండింటి మధ్య హెల్తీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడమే ముఖ్యం. ఒక గుడ్డులో కొలెస్ట్రాల్ ఎంత?గుడ్లలో డైటరీ కొలెస్ట్రాల్ ఉంటుందన్నది వాస్తవమే.

Also Read: ఈ ధనియాల నీరు రోజు తాగితే చాలు.
ఒక పెద్ద గుడ్డు పచ్చసొనలో దాదాపు 186 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ కారణంగానే పాత డైట్ గైడ్‌లైన్స్ గుడ్ల విషయంలో కొన్ని పరిమితులు సూచించాయి. కొలెస్ట్రాల్ నేరుగా గుండెపై ప్రభావంచాలామంది విషయంలో ఆహారం ద్వారా తీసుకునే కొలెస్ట్రాల్ రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలపై పెద్దగా ప్రభావం చూపదు. ఎందుకంటే, మన శరీరానికి కావాల్సిన కొలెస్ట్రాల్‌ను మన కాలేయమే ఉత్పత్తి చేస్తుంది. మనం ఆహారంలో ఎక్కువ కొలెస్ట్రాల్ తీసుకున్నప్పుడు, లివర్ తన ఉత్పత్తిని ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది.
Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే అపెండిక్స్ క్యాన్సర్ ఉన్నట్లే..!
నిజానికి, రక్తంలో చెడు (LDL) కొలెస్ట్రాల్‌ను పెంచేవి సంతృప్త (సాచురేటెడ్) కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్. ఇవి ప్రాసెస్ చేసిన మాంసం, వెన్న, బేకరీ ఫుడ్స్‌లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, గుడ్డు తినడం సమస్య కాదు, దాన్ని దేనితో కలిపి తింటున్నామన్నదే ముఖ్యం. చీజ్, బేకన్‌తో ఫ్రై చేసిన గుడ్డుకు.. అవకాడో, హోల్‌గ్రెయిన్ టోస్ట్‌తో తీసుకునే బాయిల్డ్ ఎగ్‌కు చాలా తేడా ఉంటుంది. రోజూ గుడ్డు తినొచ్చాచాలామంది ఆరోగ్యవంతులకు రోజూ ఒక గుడ్డు తినడం పూర్తిగా సురక్షితం, ఇది గుండెకు మేలు చేసే డైట్‌లో ఒక భాగం కూడా కావచ్చు.
Also Read: నోటి పూతే కదా అని నిర్లక్ష్యం చేస్తున్నారా..?
2018లో ‘హార్ట్’ అనే ప్రముఖ జర్నల్‌లో ప్రచురించిన ఒక కీలక అధ్యయనం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. చైనాలో దాదాపు 5 లక్షల మందిపై జరిపిన ఈ సర్వేలో, రోజూ ఒక గుడ్డు తినేవారికి, తినని వారితో పోలిస్తే గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ తక్కువగా ఉన్నట్లు తేలింది.