ఇలాంటి వారు గుడ్డులోని పచ్చసొన తినకపోవడమే మంచిది, ఎందుకంటే..?
చాలామంది కోడిగుడ్డు తింటేబాడీలో ప్యాట్ పెరుగుతుందని, ముఖ్యంగా గుడ్డులోని సొన తింటే అధిక బరువు సమస్యలతో బాధపడాల్సి వస్తుందని అనుకుంటుంటారు.. మరి ఇందులో నిజమెంత ..ఒకసారి తెలుసుకుందాం.. మనలో చాలా మంది గుడ్డు ను సంపూర్ణంగా తినకుండా తెల్లసొన తిని, పచ్చసొన పడేస్తారు. అయితే ముందుగా గుడ్డులోని పచ్చసొన మంచిది కాదు అనే అభిప్రాయం ఉంటే దాన్ని ముందు మీ ఆలోచనల నుంచి తొలగించండి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లకి తప్ప ఆరోగ్యంగా ఉన్న అందరికీ పచ్చసొన మంచిదే.
ముఖ్యంగా పిల్లలు, మహిళలు, గర్భిణిలకు పచ్చసొన తినడం చాలా ముఖ్యం. దీనిలో రిబోఫ్లేవిన్ ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకలకు, మానసిక ఆరోగ్యానికి అవసరం. హార్మోన్లు సక్రమంగా పనిచేయాలన్న కూడా విటమిన్ అత్యవసరం. బి12 కూడా అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కీలకమైనది. పచ్చసొన తినడం పిల్లల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రోజుకో ఒక గుడ్డు పచ్చసొన తినడం జరిగిపోయే అనర్థాలేవీ లేవు. ఆరోగ్యవంతులైనా వాళ్లు రోజూ గుడ్డును పచ్చసొనతో పాటూ తినవచ్చు.
పిల్లలకు పెట్టవచ్చు. ఊబకాయం బారిన పడి అధిక కొలెస్ట్రాల్‌తో బాధ పడుతున్న వారు పచ్చసొనను పక్కనపెట్టడం మంచిదే. ఒక గుడ్డు పచ్చసొనలో 186 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాగే గుండె జబ్బుల బారిన పడిన వారు రోజుకో గుడ్డును పచ్చసొనతో కలిపి తినవచ్చు. అంతకుమించి తినకపోవడమే మంచిది. అది కూడా వైద్యుల సూచన మేరకు తినాలి. ఇక మధుమేహంతో బాధపడుతున్నవారు. రోజులో రెండు గుడ్లు కన్నా అధికంగా తినకపోవడమే మంచిది. వీరు గుడ్డు పచ్చసొనను పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్యుల అనుమతితో గుడ్డు తినడం ఉత్తమం.
గుడ్డు తినమని, అది చాలా బలవర్ధకమని ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి. ముఖ్యంగా గర్భిణులకు, పిల్లలకు అంగన్వాడీల ద్వారా గుడ్లును ప్రత్యేకంగా అందజేస్తున్నాయి. దానికి కారణం గుడ్డులో ఉండే పోషకాలే. ఒక్కో గుడ్డు సగటున 65 గ్రాముల బరువు ఉంటుంది. దీన్ని ఉడికించి తింటే శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఇ పుష్కలంగా అందుతాయి. అలాగే ఆరుగ్రాములకు పైగా ప్రొటీన్ అందుతుంది. 78 క్యాలరీలు అందుతాయి. రోజుకో గుడ్డు తింటే చాలు శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.