ఎక్కిళ్లు ఎక్కువగా వస్తున్నాయా..? అసలు విషయమేంటంటే..?
ఎక్కిళ్ల ప్రభావం గొంతు మీదే ఎక్కువగా ఉంటుంది. కానీ ఎక్కిళ్లు మొదలయ్యేది మాత్రం గొంతులో కాదు. ఊపిరితిత్తులు, పొట్ట భాగాలను వేరు చేస్తూ పక్కటెముకలను అంటిపెట్టుకుని డోమ్ షేప్‌లో ఒక మజిల్ ఉంటుంది. దీన్ని డయాఫ్రేమ్ అంటారు. ఇది ఒక వాల్వ్‌లా పని చేస్తుంది. ఊపిరి పీల్చినప్పుడు ఇది కిందికి వెళ్లి లంగ్స్‌లోకి గాలి వస్తుంది. మళ్లీ డయాఫ్రేమ్ పాత పొజిషన్‌కు వచ్చినప్పుడు నోరు, ముక్కులోంచి గాలి బయటకు వెళ్తుంది.
అయితే చాలామందికి ఎక్కిళ్లు తరచుగా వస్తుంటాయి. వీటికి కారణం ఛాతి అడుగున ఉండే డయాఫ్రమ్ అసంకల్పితంగా స్పందించినపుడు కలిగే శారీరక మార్పే ఎక్కిళ్ళు. ఇలా జరగటానికి చాలా కారణాలున్నాయి. కానీ, ఎక్కళ్ల వల్ల కొన్ని సందర్బాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా మారుతుంది. ఈ పరిస్థితిని తట్టుకోవడం కష్టం అవుతుంది. అయితే, ఎక్కిళ్లు రాకుండా ఉండాలంటే ఎక్కిళ్లను ప్రేరేపించే విషయాలకు, తినుబండరాలకు దూరంగా ఉంటే చాలు.
అయితే కొన్ని ఇంటి నివారణలు మీ ఈ సమస్యను అధిగమించగలవని నిపుణులు చెబుతున్నారు. ఎక్కిళ్లను తొలగించడంలో నిమ్మకాయ, చక్కెర మీకు గొప్పగా సహాయపడుతాయి. మీరు నిమ్మరసంలో చక్కెర కలిపి తీసుకుంటే, ఎక్కిళ్ళ సమస్య వెంటనే తొలగిపోతుందని చెబుతున్నారు. నీళ్లు ఎక్కువగా త్రాగడం వల్ల కూడా సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఈ సమస్య వస్తుంది.
ఎక్కిళ్ళు వచ్చినట్లయితే నేలపై కూర్చుని మోకాళ్లను ఛాతీకి అతుక్కోవాలి. 5 నిమిషాల తర్వాత మీ ఎక్కిళ్ళు పోయినట్లు మీకు అనిపిస్తుంది. మీకు ఎక్కిళ్ళు ఉంటే మీ దృష్టిని దాన్నుంచి మీ దృష్టిని మళ్లించటం మంచిది.. కొన్నిసార్లు ఎక్కిళ్ల సమస్యను దృష్టిని మరల్చడం ద్వారా కూడా అధిగమించవచ్చు.తేనెను తీసుకోవడం ద్వారా కూడా ఎక్కిళ్ల సమస్యను అధిగమించవచ్చు.