పెళ్లిపీటలెక్కనున్న క్రేజీ హీరోయిన్..! .ఆమెకి కాబోయే భర్త ఎవరో తెలుసా..?

మలయాళ ప్రముఖ హీరోయిన్ పార్వతి నాయర్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ఓ వ్యాపార వేత్తతో కలిసి ఆమె ఏడడుగులు నడవనుంది. అయితే అబుదాబిలో స్కూల్ చదువు పూర్తి చేసిన పార్వతి నాయర్, 15 ఏళ్లకే మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివారు. కాలేజీలో చదువుతున్నప్పుడు మోడలింగ్‌లో చురుగ్గా పాల్గొన్నారు. కర్ణాటక ‘మైసూర్ శాండల్ సోప్’ బ్రాండ్ అంబాసిడర్‌గా, నేవీ క్వీన్ అందాల పోటీలో టైటిల్ గెలుచుకున్నారు.
అలాగే, మిస్ కర్ణాటక అందాల పోటీలో పాల్గొని, మొదటి బహుమతిని గెలుచుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొని రాష్ట్ర స్థాయిలో ఎంపికయ్యారు. మోడలింగ్ తర్వాత నటనపై దృష్టి సారించిన పార్వతి నాయర్… 2012లో ‘పాపిన్స్’ అనే మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత వరుసగా పలు మలయాళ చిత్రాల్లో నటించారు. మలయాళం తర్వాత కన్నడ, తమిళ భాషల్లో నటించడానికి ఆసక్తి చూపారు. ఆ విధంగా 2014లో రవి మోహన్ నటించిన ‘నిమిర్ందు నిల్’ చిత్రంతో పరిచయం అయ్యారు.

ఈ సినిమా తర్వాత, 2015లో… అజిత్ నటించిన ‘ఎన్నై అరిందాల్’ చిత్రంలో విలన్ అరుణ్ విజయ్‌కి జంటగా ధైర్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమాకి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యారు. తమిళంలో ఉత్తమ విలన్, మాలై నేరత్తు మయక్కం, కోడిట్ట ఇడంగలై నిరప్పుగ, ఎంగిట్ట మోదాదే, నిమిర్, సీతక్కతి వంటి పలు చిత్రాల్లో నటించారు. చివరిగా విజయ్ నటించిన వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రంలో జూనియర్ చాట్స్ ఆఫీసర్ పాత్రలో నటించారు.