Health

రోజు ఈ ఆకూ ఒకటి తించే మీ కంటి చూపు పెరిగి, జీవితంలో కంటి సమస్యలు రానేరావు.

కంటి ఆరోగ్యానికి కొన్ని ఆహార పదార్థాలు చాలా మంచివి. వాటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వలన కంటి సమస్యలు తగ్గి.. కంటి చూపు మెరుగుపడుతుంది. అయితే దేవుడి పూజ, నోములు, వ్రతాలు అంటే చాలు అక్కడ తమల పాకులు కట్టలు కట్టలు కనిపిస్తాయి. ఇంతే వీటి లాభాలు అనుకుంటారు చాలా మంది. కానీ తమలపాకులు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా కంటి చూపును కాపాడుకోవడానికి తమలు పాకులు తినడం చాలా అవసరం. అలాగే నిద్రలేమి కారణంగా చాలా మంది ఇబ్బందులు పడతారు.

వికారంగా అనిపించడం, మలబద్ధకం, అసిడిటీ వంటివి కలుగుతాయి. ఇవన్నీ పోవాలంటే చక్కగా నిద్రపోవాలి. నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల కంటి పనితీరు కూడా దెబ్బతింటుంది. నిద్ర బాగా పట్టాలన్నా, కంటి చూపు మెరుగుపడాలన్నా కూడా రోజు తినాల్సిన ఆకులు తమల పాకులు. రోజుకు రెండు ఆకులు తొడిమను తీసేసి నమిలి వేయాలి. అందులో చిన్న పిసరు పచ్చకర్పూరం పొడి వేసి నమిలి వేస్తే మంచి ఫలితం ఉంటుంది. కిళ్లీలను అందరూ తింటారు. కానీ అందులో వాడే పదార్థాల వల్ల పెద్ద ఉపయోగం ఉండదు.

ఒట్టి తమలపాకు తిన్నా మంచిదే లేదా, పచ్చ కర్పూరం అతి తక్కువ పరిమాణంలో కలుపుకుని తిన్నా మంచిదే. తమలపాకుకు కాస్త వెన్న రాసి పైన చిటికెడులో సగం పచ్చకర్పూరం పొడి వేసి తింటే ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. ఒకేసారి నమిలి మింగేయకుండా బుగ్గలో నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా కొన్ని రోజుల పాటూ చేయడం వల్ల కంటి చూపు మెరుగుపడడంతో పాటూ నిద్ర బాగా పడుతుంది. అసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కంటి సమస్యలు ఏవైనా అంటే కళ్లు మంటలు అనిపించడం, నీరు కారడం, ఎర్రబడడం వంటి సమస్యలనీ ఇలా తమలపాకును నమలడం వల్ల పోతుంది.

ఇంకా ఎన్నో లాభాలు.. రోజుకో తమలపాకు నమలడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వీటిల్లో కాల్షియం, ఇనుము, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది ఆకలిని పెంచుతుంది. ఆహారం అరిగేలా చేస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారికి తమలపాకు తినడం వల్ల లాభం కలుగుతుంది. కడుపుబ్బరంగా అనిపించినప్పుడు రెండు తమలపాకులు నమిలేసి కాస్త పాలు తాగితే మంచిది. తమలపాకు తినడం జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి. ఆహారం త్వరగా అరుగుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker