బ్రెయిన్ స్ట్రోక్‌లాగే కంటికి కూడా స్ట్రోక్ వస్తుందని మీకు తెలుసా..? కంటిస్ట్రోక్ లక్షణాలు ఇవే.

బయటి వాతావరణ స్థితుల నుంచి ఏవైనా మందులు వాడటం లేదా మరేదైనా శారీరక అనారోగ్యం వంటి కారణాలలో ఏదైనా కావచ్చు. తరచుగా కళ్లు తిరుగడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. అయితే చాలా సార్లు పెద్దగా చికిత్స అవసరం లేకుండానే చక్కబడే సమస్య. కానీ అప్పుడప్పుడు ఇలా కళ్లు తిరగడం ఏదైనా అనారోగ్యానికి కూడా కారణం కావచ్చు. అయితే ఒకే కంటికి…
కంటి స్ట్రోక్ వచ్చే ముందు చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి. కానీ అవగాహన తక్కువ కాబట్టి చాలా మందికి దీని గురించి తెలిసే అవకాశం ఉండదు. కళ్ళలోని చిన్న రక్తనాళాలు దెబ్బ తినడం ద్వారా మొదటి లక్షణం కనిపిస్తుంది.
అస్పష్టంగా కనిపించడం, చూపులో చీకటి ప్రాంతాలు లేదా నీడ లాంటివి కనిపించడం జరుగుతుంది. వైద్యులు చెబుతున్న ప్రకారం రెండు కళ్ళకు కంటి స్ట్రోక్ ఒకేసారి వచ్చే అవకాశం తక్కువే, ఒక కంటికి మొదట కంటి స్ట్రోక్ వస్తుంది. అప్పుడు వెంటనే చికిత్స తీసుకుంటే రెండో కంటికి రాకుండా కాపాడుకోవచ్చు. రెండు కళ్ళకు ఒకేసారి కంటి స్ట్రోకు వస్తే మాత్రం శాశ్వతంగా చూపు కోల్పోతారు. ఎందుకు వస్తుంది.. ముందే చెప్పినట్టుగా కంటిలోని రక్తనాళాలు దెబ్బ తినడం వల్ల ఈ స్ట్రోక్ వస్తుంది. అలాగే రక్తనాళాల్లో రక్తం ప్రసరణ సరిగా లేకపోయినా కూడా వచ్చే అవకాశం ఉంది. ఆప్టిక్ నాడి అనేది మెదడును, కంటిని అనుసంధానించే ఒక నరం.
దీనిలో మిలియన్ల కొద్ది నరాల ఫైబర్లు ఉంటాయి. ఈ ఆప్టిక్ నాడి దెబ్బతింటే కంటి స్ట్రోక్ అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి ఈ కంటి పక్షవాతం రక్తనాళాల్లో అడ్డంకులు లేకపోయినా కూడా కణజాలాలు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు కూడా వస్తుంది. ఆప్టిక్ నరాలకు పోషకాలు, రక్,తం ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినా… ఈ స్థితి వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే.. నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్ చెబుతున్న ప్రకారం 50 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి ఈ కంటి స్ట్రోకు వచ్చే అవకాశం ఎక్కువ.
అలాగే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు, మధుమేహం ఉన్నవారికి కూడా ఇది వచ్చే ఛాన్సులు ఉన్నాయి. గ్లాకోమా వంటి కంటి సమస్యలతో బాధపడే వారు కూడా కంటి స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది. కంటిస్ట్రోక్ వచ్చేటప్పుడు ఆ లక్షణాలు కొన్ని సార్లు రోజుల తరబడి నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. అలా కాకుండా ఒక్కోసారి అకస్మాత్తుగా పిడుగు పడినట్టు కూడా జరగవచ్చు. మీరు చూస్తున్నప్పుడు బూడిద రంగు మచ్చలు కనబడుతున్నా, కంటి మధ్యలో రక్తం లేదా ద్రవాలు లీక్ అవుతున్నా కూడా అది స్ట్రోక్ కు వల్ల అవ్వచ్చు.
కంటిలో తీవ్రమైన నొప్పి, ఒత్తిడి అనిపిస్తున్నా కూడా తేలిగ్గా తీసుకోకూడదు. కన్నుల్లో కొంత భాగం మబ్బు మబ్బుగా కనిపించడం కూడా కంటి స్ట్రోక్ లక్షణమే. చికిత్స ఇలా.. నిపుణుల అభిప్రాయం ప్రకారం కంటి స్ట్రోక్ చికిత్స అనేది స్ట్రోక్ వల్ల కన్ను ఎంత నష్టపోయింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నష్టం తక్కువగా ఉంటే కంటి ప్రాంతాన్ని మసాజ్ చేయడం వంటివి చేస్తారు. లేజర్ చికిత్స అందిస్తారు.