ఉదయం నిద్రలేవగానే కంటి చుట్టూ వాపు కనిపిస్తుందా..? మీరు వెంటనే ఏం చెయ్యాలంటే..?
చాలామందికి కళ్లకింద వాపు ఉంటుంది. కొంచెం ఉంటే చూసేందుకు అందంగా ఉంటుంది. కానీ ఎక్కువగా ఉంటే అది ప్రమాదం. కంటి చుట్టూ ఉన్న చర్మంవాపు వల్ల కళ్ల కింద ఉబ్బెత్తుగా కనబడుతుంది. అయితే ప్రస్తుతం చాలా మందిలో ఉదయం నిద్రలేవగానే కళ్ళు ఉబ్బినట్లు కనిపిస్తాయి. అంతేకాకుండా వాపు సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఉబ్బిన కళ్ల కారణంగా మేకప్ కూడా సరిగా కనిపించదు.
కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ ఐస్ సొల్యూషన్‌ను వినియోగించడం వల్ల కంటి చుట్టూ చర్మానికి విటమిన్ ఇ లభించి కంటి వాపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసా..ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవనశైలిని అనుసరిస్తున్నారు.
అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలతో పాటు, కళ్ల చుట్టు వాపు సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ ఉబ్బిన కళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
ఉబ్బిన ఐస్ సొల్యూషన్‌ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు.. ఈ సొల్యూషన్‌ను తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో చల్లటి నీరు పోయాలి. ఆ తర్వాత అందులోనే రెండు చెంచాల విటమిన్ ఇ నూనెను వెసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. అంతే సులభంగా ఉబ్బిన ఐస్ సొల్యూషన్ రెడీ అయినట్లే.
ఇలా వినియోగించండి.. ఐస్ సొల్యూషన్‌ను కళ్ల వాపును తగ్గించుకోవడానికి కాటన్ ప్యాడ్ తీసుకోండి. ఈ కాటన్ ప్యాడ్‌ను సిద్ధం చేసిన సొల్యూషన్‌లో నానబెట్టండి. దీని తర్వాత మీరు ఈ కాటన్ ప్యాడ్‌లను మీ కళ్లపై అప్లై చేయాలి. అంతే సులభంగా మీరు కళ్లపై వాపు సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.