ఈ ఆయిల్ రాస్తే 45 ఏళ్ల తర్వాత కూడా మీ ముఖం ముడతలు లేకుండా అందంగా ఉంటుంది.
వాతావరణ పరిస్థితులు, కలుషితమైన గాలి కారణంగా ముఖంతో తేజస్సు తగ్గిపోతుంది. మొటిమలు తయారవుతాయి. ఇక వేళకు తినకుండా ఒత్తిడికి లోనయ్యే వారికి నల్లటి వలయాలు కంటి చుట్టూ ఏర్పడతాయి. మనం తినే ఆహారం కూడా మన అందం పై ప్రభావం చూపుతుంది. అందుకే వైద్యులు సరైన పోషక ఆహారం తీసుకోవాలని సూచిస్తారు. అయితే 30 ఏళ్ల తర్వాత చర్మంపై కాంతి తగ్గిపోతోంది.
దీని కారణంగా ముఖం అందహీనంగా తయారవుతుంది. అందుకే ఈ వయసు తర్వాత చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్ల తర్వాత చర్మంలో లూజ్‌నెస్ ఏర్పడుతుంది. దీని వల్ల చర్మంపై ముడతలు ఏర్పడి చర్మంపై తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. 30 ఏళ్ల తర్వాత చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడం చాలా ముఖ్యం. మాయిశ్చరైజర్ చర్మానికి పోషణనిచ్చి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది.
చర్మ రకాన్ని బట్టి మాయిశ్చరైజర్‌ని ఎంచుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీని ప్రభావవం తేమపై కూడా పడుతుంది. టోనర్.. చర్మంపై టోనర్ ఉపయోగించడం కూడా చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. టోనర్‌ను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల చర్మం లోపల ఉండే మురికిని శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా చర్మం యొక్క pH స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల చర్మం మెరిసేలా తయారవుతుంది.
సీరం.. చర్మానికి సీరమ్ అప్లై చేయడం వల్ల చర్మ కణాలు మెరుగుపడుతాయి. కాబట్టి రాత్రి పూట సీరమ్‌ను ఉపయోగించడం వల్ల అన్ని రకాల చర్మ సమస్యల నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సీరమ్ చర్మానికి పోషణనిచ్చి శుభ్రంగా ఉంచుతుంది. సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి.. ముఖ సంరక్షణ కోసం సన్‌స్క్రీన్ ఉపయోగించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. సన్‌స్క్రీన్ ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.