ఈ కాషాయం తాగితే మీ శరీరంలోని కొవ్వు వారంలో కరిగిపోతుంది.
పొట్ట చుట్టూ చెరిపోయిన కొవ్వు వల్ల మధుమేహం, గుండె సంబంధిత సమస్యలతో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధులతో పోరాటం చేయాల్సి వస్తుంది. కొవ్వు పేరుకుపోవడానికి కారణం తీసుకునే ఆహారం, సరిగా వ్యాయామం చేయకపోవడం. పొద్దున్నే లేచి ఎక్సర్ సైజ్ చెయ్యడం అంటే శీతాకాలంలో చాలా కష్టం. చల్లటి గాలుల కారణంగా ఎక్కువ సేపు ముసుగుతన్ని పడుకోవాలని అనిపిస్తుందే తప్ప శారీరక శ్రమ మీద దృష్టి పెట్టడం కాస్తం అవుతుంది. అలా చేయడం వల్ల బరువు పెరుగుతారు, కొవ్వు పేరుకుపోతుంది.
అయితే ఇటీవల కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోవడంతో చూడటానికి అందవిహీనంగా కనిపిస్తున్నారు. దీంతో నలుగురిలోకి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి మనం తినే ఆహారాలే కారణం. మన జీవనశైలిలో మార్పులు ఉండటం లేదు. ఇష్టారీతిగా ఆహారాలు తింటుంటే బరువు పెరగడం సహజమే. బరువు పొట్ట చుట్టు చేరే కొవ్వుతోనే ఉంటుంది.
దీని వల్ల మనకు ఇబ్బందులు తలెత్తుతాయి. దీన్ని దూరం చేసుకోవాలంటే జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. మనం నిత్యం వంటల్లో వాడే జీలకర్రతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అధిక బరువును కంట్రోల్ లో ఉంచుతుంది. దీని కషాయం మనకు ఔషధంలా పనిచేస్తుంది. దీంతో జీలకర్ర వాడితే మనకు కొవ్వు లేకుండా చేస్తుంది. ఈ నేపథ్యంలో జీలకర్ర వాడుకుని మన కొవ్వును మాయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
ఒక గిన్నెలో నీరు పోసి అందులో ఒక చెంచె జీలకర్ర వేసి దాన్ని ఏడు నిమిషాలు మరిగించాలి. తరువాత ఒక గ్లాసులోకి తీసుకోవాలి. అందులో కాసింత బెల్లం వేసుకుని తాగాలి. దీంతో జీలకర్రలో ఉన్న పోషకాలు నీటిలోకి వస్తాయి. ఈ నేపథ్యంలో జీలకర్ర రసం కొవ్వును కరిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. బెల్లం ఆర్గానిక్ ది అయి ఉంటే మరింత మంచి ఫలితం వస్తుంది. ప్రతి రోజు ఈ కషాయాన్ని పరగడుపున తాగుతుండాలి.
ఇది తాగిన తరువాత అరగంట వరకు కాఫీ లేదా టీ తాగాలి. దీంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు వేగంగా కరుగుతుంది. ఇలా జీలకర్ర, బెల్లం కొవ్వును కరిగించడంలో సాయపడుతున్నాయి. వీటిని కలిపి తీసుకునే కషాయం వల్ల కొవ్వు కరిగి నాజూకుగా తయారవడం ఖాయం. వారం రోజులు ఈ కషాయం తాగితే పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వు మాయం కావడం సహజంగా జరుగుతుంది.