Health

ఫ్యాటీ లివర్ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

ఫ్యాటీ లివర్ నిజానికి రెండు రకాలు. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అందులో మొదటిది. మద్యం ఎక్కువగా సేవించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇక రెండోది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఇది అధిక బరువు ఉండడం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, డయాబెటిస్‌.. వంటి కారణాల వస్తుంది. అయితే ఈ రెండింటిలో ఏ సమస్య వచ్చినా రోగులలో పలు లక్షణాలు కనిపిస్తాయి.

అయితే ఇటీవల జరిగిన అధ్యయనంలో ఫ్యాటీ లివర్ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు మెదడు సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని తేలింది. ఇటువంటి వారిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల లివర్ ఫ్యాట్, మెదడుకు సంబంధించిన అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో నిపుణులు అనారోగ్యకరమైన ఆహారం తీసుకునే వ్యక్తులు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని తేల్చారు.

పేలవమైన రెగ్యులర్ డైట్ వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రమాదం పెరుగుతుంది. ఒక వ్యక్తి మొత్తం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం పెరిగినప్పుడు అది క్రమంగా స్థూలకాయానికి దారితీస్తుంది. నియంత్రణ లేని ఊబకాయం మెదడు సమస్యలకు దారితీస్తుంది.

తీవ్రమైన కడుపు నొప్పి, వికారం, ఆకలి లేకపోవడం, ఆకస్మిక బరువు నష్టం, ఉబ్బిన పొత్తికడుపు, కాళ్ళు, విపరీతమైన అలసట, బలహీనత, చర్మం రంగులో మార్పు వంటివి ఫ్యాటీ లివర్ లక్షణాలుగా చెప్పవచ్చు. శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని సురక్షితంగా ఉంచడానికి ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే రోగాలకి దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా బయటి జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం మానేయాలి. వీలైనంత వరకు ఇంటి ఆహారాలు తినడమే మేలు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker