Fever: జ్వరం వచ్చినపుడు చికెన్ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

Fever: జ్వరం వచ్చినపుడు చికెన్ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
Fever: మనిషి ఆరోగ్యానికి మంచి ఆహారం చాలా అవసరం. అయితే కల్తీ ఎక్కువ పెరగడంతో ఫుడ్‌లో క్వాలిటీ తెలియట్లేదు. ఇక కొరియర్ సర్వీసులు, ఫుడ్ కంపెనీలు ఎక్కువవడంతో ఇంట్లో వండుకోవడం కూడా చాలామంది తగ్గించేశారు. అయితే జ్వరం వచ్చే మనకి తెలియకుండానే మనం నీరసం అయిపోతుంటాం. పూర్తిగా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. దీంతో జీర్ణ శక్తి కూడా తగ్గుతుంది. ఈ క్రమంలోనే నాన్ వెజ్ తినకూడదని నిపుణులు చెబుతుంటారు.
Also Read: వాటర్ బాటిల్ మూతల రంగు వేర్వేరుగా ఎందుకు ఉంటాయి.
ఎందుకంటే చికెన్, మటన్ వంటివి తినడం వల్ల తొందరగా జీర్ణం కాదు. కాబట్టి నాన్ వెజ్ తినకుండా.. తొందరగా జీర్ణం అయ్యే వాటిని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే జ్వరం ఉన్న సమయంలో మాంసాహారం తీసుకోవడం వల్ల లివర్ పని తీరు బాగా తగ్గిపోతుంది. దీంతో పచ్చ కామెర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే జ్వరం వచ్చిన సమయంలో మాంసం వంటివి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే చికెన్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

ఆరోగ్యానికి మంచిదే కదా అని అందరూ అనుకుంటారు. అయితే వీటిని ఇలా కాకుండా సూప్‌లా తయారు చేసుకుని తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. సూప్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. అలాగే తొందరగా జీర్ణం అవుతుంది. కాబట్టి డైరెక్ట్‌గా కాకుండా ఇలా తీసుకోవడం మంచిది. చికెన్, మటన్ అంటే ఎక్కువగా మసాలా, ఆయిల్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కాదు. అందులోనూ జ్వరం వచ్చినప్పుడు అంటే అసలు చెప్పక్కర్లేదు.
Also Read: ఈ మొక్కని ఇలా చేసి వాడితే మీ పంటి నొప్పితో పాటు అనేక వ్యాధులు వెంటనే తగ్గిపోతాయి.
అందుకే జ్వరం వచ్చిన సమయంలో వీటిని తినకూడదు. ఇందులోని మసాలా, ఆయిల్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనికి తోడు జ్వరం ఎక్కువ అవుతుంది. కాబట్టి జ్వరం వచ్చిన సమయంలో నాన్ వెజ్ ఎక్కువగా తినకూడదు. పూర్తిగా జ్వరం తగ్గిన తర్వాత మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు.