ఇలాంటి చేపలు తినేముందు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే..?
చేపలు తినడం వల్ల పోషక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇది ఓరకంగా ప్రమాదాలను కూడా తెచ్చి పెడుతుంది. మారుతున్న పర్యవరణ ప్రమాదాలలో భాగంగా చేపలు నీరు, తినే ఆహారం నుండి హానికరమైన రసాయనాలను తీసుకోవచ్చు. పాదరసం, పిసిబిలు వంటి రసాయనాలు కాలక్రమేణా చేపల శరీరంలో పేరుకుపోతాయి. అయితే విటమిన్లు, మినరల్స్.. చేపల్లో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే డాక్టర్లు చేపలు తినమని సూచిస్తారు. వీటిలోని నాణ్యమైన ప్రొటీన్లు, కొవ్వులు శరీరానికి మంచిచేస్తాయి. విటమిన్-డి కూడా పుష్కలమే.
ఆరోగ్యకరమైన కొవ్వులు..సాల్మన్, మాకెరెల్, సార్డిన్లు లాంటి చేపల్లో ఒమేగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే చేపల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికం. మెదడు, కండ్లకు ఫ్యాటీ ఆమ్లాలు అత్యంత ఆవశ్యకం. కాబట్టి ఏదో ఒక రూపంలో ఒమేగా- 3 ఫ్యాటీ ఆమ్లాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరం వీటిని సొంతంగా తయారు చేసుకోలేదు. చేపల ద్వారానే శరీరానికి లభిస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు తగిన మోతాదులో అందకపోతే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టు ముడతాయి. మెదడుకు మేత..తరచూ చేపలు తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి మంచిది.
వయసు పెరిగేకొద్దీ మెదడు సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది చివరికి అల్జీమర్స్ లాంటి మతిమరుపు వ్యాధులకు దారితీస్తుంది. చేపలు తినేవారిలో జ్ఞాపకశక్తి ఎక్కువనీ, మెదడు సంబంధ వ్యాధులు నామమాత్రమనీ అధ్యయనాల్లో తేలింది. వారానికి ఒక్కసారైనా చేపలు తినేవారిలో జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడు భాగం ‘గ్రేమ్యాటర్’ చైతన్యంగా ఉంటుందని నిపుణులు చెబుతారు. బరువు తగ్గడంలో.. చేపల్లో ప్రొటీన్ల మోతాదు ఎక్కువ. ప్రొటీన్లు తీసుకుంటే బరువు తగ్గుతారు. చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు జీవక్రియ మీద సానుకూలమైన ప్రభావం చూపుతాయి.
అయితే చేపల్లో కొవ్వు కూడా ఉంటుంది కాబట్టి, కెలోరీలు కూడా కించిత్ ఎక్కువేననే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నూనెలో వేయించిన, మసాలాలో ముంచి తేల్చిన చేపల కూరలకు దూరంగా ఉంటే మంచిది. కంటిచూపుతో..చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కంటి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. ఒక అధ్యయనం ప్రకారం ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల వల్ల మెదడు, కండ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వయసుతోపాటు తలెత్తే దృష్టిదోషాన్ని కూడా చేపలు తినడం ద్వారా అడ్డుకోవచ్చు. చేపలు తినని వారితో పోలిస్తే తినేవారిలో రెటీనా పనితీరును దెబ్బతీసే.. ఏఎమ్‌డీ ముప్పు 43 శాతం తక్కువని పరిశోధనల్లో తేలింది.