Fish Venkat: ఫిష్ వెంకట్ బతకాలంటే అదొక్కటే మార్గం అంటూ అసలు విషయం చెప్పేసిన డాక్టర్స్.

Fish Venkat: ఫిష్ వెంకట్ బతకాలంటే అదొక్కటే మార్గం అంటూ అసలు విషయం చెప్పేసిన డాక్టర్స్.
Fish Venkat: వీవీ వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’ సినిమాలో “తొడకొట్టు చిన్నా” అనే డైలాగ్‌తో గుర్తింపు పొందిన వెంకట్, ఆ తరువాత వరుసగా అనేక టాప్ హీరోల సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో మంచి పేరు సంపాదించారు. వెంకట్ గత 9 నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు.

అయితే మళ్లీ ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యాడు ఫిష్ వెంకట్. తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నాడు. మరోవైపు ఫిష్ వెంకట్ చికిత్స కోసం సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని నటుడి భార్య, కూతురు చేతులెత్తి మొక్కుతున్నారు. కాగా ఫిష్ వెంకట్ కు సరైన చికిత్స అందితే బతికే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు.
Also Read: వెంటిలేటర్‌పై తెలుగు కామెడీ విలన్ ఫిష్ వెంకట్, సాయం కోసం వేడుకుంటున్న భార్య.
‘వెంకట్ కిడ్నీ సమస్యకు డయాలసిస్ చేయించుకుంటున్నారు. కానీ ఆయన పరిస్థితి ఇప్పుడు మరింత క్షీణించింది. ఇప్పుడు అవయవ మార్పిడి చేస్తే ఆయన ప్రాణాలకు ముప్పు తప్పుతుంది. ప్రస్తుతం ఆయనను బతికించుకునేందుకు ఇదొక్కటే మార్గం. ప్రస్తుతం డయాలసిస్ చేస్తే ఫిష్ వెంకట్ పరిస్థితి మెరుగవచ్చు… కానీ మళ్లీ సిక్ అవ్వడంఖాయం.
Also Read: కేసీఆర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేసిన యశోద వైద్యులు.
పైగా ఆయన ఎక్కువగా స్పృహలో ఉండటం లేదు. ఒక్క డయాలసిస్ చేసినప్పుడు మాత్రమే ఆయన కాస్త మెరుగ్గా కనిపిస్తున్నారు వీలైనంత త్వరలో ఆయనకు కిడ్నీను మారిస్తే బ్రతికే అవకాశం ఉంది’ అని వైద్యులు తెలిపారు.
వెంటిలేటర్ పై ఫిష్ వెంకట్..
— Filmy Wala Telugu (@NewsWalaFilmy) July 3, 2025
ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు.
గతంలో 2 లక్షలు సాయం చేసిన పవన్ కల్యాణ్.
ఇలాంటి వారిని ఆదుకోకుండా మా అసోసియేషన్ ఏం చేస్తుందని అభిమానుల ఆగ్రహం.@iVishnuManchu#Fishvenkat pic.twitter.com/ahjClMViCM