ఫ్రిడ్జ్ లో ఈ ఆహారపదార్దాలను మాత్రం అస్సలు పెట్టకండి.
ఫ్రీజర్ లో నిల్వ చేయకూడనివి కూడా కొన్ని ఆహారపదార్థాలు ఉన్నాయి. వాటిని ఫ్రిజ్ లో పెట్టడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వీటిని మాత్రం ఫ్రిజ్ లో పెడితే వాటి సహజ గుణాన్ని కోల్పోతాయి. అయితే నిజానికి కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఫ్రిజ్ లో ఈ ఆహార పదార్థాలను పెట్టి తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి.
కాబట్టి ఎప్పుడూ కూడా ఈ ఆహార పదార్థాలని అస్సలు ఫ్రిడ్జ్ లో పెట్టకండి. బంగాళదుంపలు.. బంగాళదుంపలు ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్ లో మాత్రమే ఉండాలి. బంగాళదుంపలను ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు ఫ్రిడ్జ్ లో వీటిని ఉంచడం వలన గ్యాస్ ని విడుదల చేస్తాయి. అరటి పండ్లు.. అరటి పండ్లను కూడా రూమ్ టెంపరేచర్ లో మాత్రమే ఉంచాలి వేడిగా ఉన్నచోట అరటి పండ్లను పెడితే త్వరగా మగ్గుతాయి కూడా.
కానీ ఫ్రిడ్జ్ లో మాత్రం అసలు పెట్టకూడదు. తేనె.. తేనెను కూడా అసలు ఫ్రిజ్లో పెట్టకూడదు తేనెని ఫ్రిజ్లో పెట్టడం వలన కూడా సమస్యలు వస్తాయి. ఎప్పుడైనా సరే తేనెని బయటే ఉంచాలి. కొత్తిమీర, పుదీనా.. కొత్తిమీర, పుదీనా, తులసి ఇటువంటివన్నీ కూడా మనం ఫ్రిజ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్ లో వీటిని పెట్టడం వలన త్వరగా ఎండిపోతాయి కాబట్టి గ్లాసు నీళ్లలో వాటిని ఉంచండి.
డైరెక్ట్ గా సూర్యకిరణాలు పడకుండా చూసుకుంటే చాలు. కాఫీ.. కాఫీ ని కూడా అసలు ఫ్రిజ్లో పెట్టకండి ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ లో మాత్రమే దానిని స్టోర్ చేయండి. టమాటాలు.. టమాటాలని కూడా చాలామంది ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటారు కానీ టమాటాలను కూడా అసలు పెట్టకూడదు. ఫ్రిడ్జ్ లో టమోటాలను పెట్టడం వలన వాటి రుచి పోతుంది.