ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్లు తింటున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసుకోండి.
ప్రతిరోజు బజారుకు వెళ్లి తీసుకు రావడం కుదరదు కాబట్టి, వారానికి సరిపడా కూరగాయలు తీసుకొని, ఫ్రిజ్ లో భద్రపరచి ఉంటాం. కూరగాయలు మాత్రమే కాకుండా, గుడ్లు, పాలు మొదలైన వాటిని ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకుంటారు. కానీ ఇలా నిల్వ ఉంచకుండా వాటిని తీసుకోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మనలో చాలామంది గుడ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.
రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయి. భారతీయ పోషకాహార సంస్థ సైతం పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు గుడ్లు తింటే మంచిదని సూచిస్తోంది. గుడ్లలో ఉండే ప్రోటీన్లు, కాల్షియం వల్ల శరీరానికి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు గుడ్లను ఫ్రిజ్ లో నిల్వ చేయొద్దని సూచిస్తున్నారు.
తాజా అధ్యయన ఫలితాలు గుడ్లను ఫ్రిజ్ లో పెడితే ఆరోగ్యాన్ని ఇచ్చే గుడ్లు అనారోగ్యానికి కారణమవుతాయని చెబుతున్నారు. చల్లని ఉష్ణోగ్రతలో గుడ్లను నిల్వ చేస్తే గుడ్లపై బ్యాక్టీరియా పెరుగుతుందని అలాంటి గుడ్లను తీసుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువని చెబుతున్నారు. గుడ్డు షెల్ పై ఏర్పడే బ్యాక్టీరియా గుడ్లలోకి ప్రవేశించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
బ్యాక్టీరియా గుడ్డులోకి చేరితే కొత్త ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని తెలుపుతున్నారు. గది ఉష్ణోగ్రత దగ్గర మాత్రమే గుడ్లను నిల్వ చేస్తే మంచిదని సూచిసున్నారు. ఫ్రిజ్ లో గుడ్లను ఉంచితే గుడ్లలో ఉండే ప్రోటీన్లు, క్యాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సైతం నాశనమవుతాయి. ఫ్రిజ్ లో ఉండే తక్కువ ఉష్ణోగ్రత వల్ల పోషకాలన్నీ పోతాయి.
అలాంటి గుడ్లను తిన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కొన్నిసార్లు గుడ్లు చెడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఫ్రిజ్ లో నిల్వ చేసే గుడ్లు రుచిని కూడా కోల్పోతాయి. ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లను తీసుకుంటే అస్వస్థతకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. మరోవైపు శీతాకాలం గుడ్లు తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అనేక అధ్యయనాల ప్రకారం గుడ్లను సాధారణ గది ఉష్ణోగ్రత దగ్గర ఉంచితే మంచిది.