Health

మధుమేహాన్ని శాశ్వతంగా తగ్గించే గ‌డ్డిచామంతి. ఎలా వాడాలంటే..?

ఈ మొక్కలో అనేక ఆయుర్వేద గుణాలున్నాయట. ముఖ్యంగా ఆయుర్వేదంతో మనిషి వాత, పిత్త, కఫ సంబంధ రుగ్మతలతో రోగాల బారిన పడతారని విశ్లేషణ. వీటన్నికి మంచి చికిత్స మన ఆయుర్వేదం.. ఒకప్పుడు ప్రాచీన వైద్యం. ఈ ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు ఉపయోగించే మొక్క గడ్డి చామంతి. దెబ్బ తగిలిన చోట ఏర్పడిన గాయానికి గడ్డి చామంతి ఆకుల రసాన్ని అప్లై చేస్తే ..

అది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. అయితే ఈ చెట్టు ఆకులలో యాంటీ కార్సినోజెనిక్ ఉన్నాయి. ఇది మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఈ ఆకులను నమలడం ద్వారా డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయి. జుట్టు సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ఈ ఆకులను వాడితే ఫలితం ఉంటుంది. జలుబు, దగ్గు , గొంతు గరగర నుంచి వెంటనే ఉపశమనం కలిగించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

జుట్టు ఆరోగ్యంగా పెరగటానికి, జట్టురాలటాన్ని నివారించటానికి గడ్డి చామంతి ఉపయోగపడుతుంది. ఈ చెట్టు ఆకులు తీసుకుని శుభ్రం చేసుకుని ఆకులను మెత్తగా పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ ఆకుల పేస్ట్ను తగినంత ఆవనూనె పోసి నూనె మాత్రమే మిగిలి వరకు సన్నని మంట మీద మరిగించాలి ఈ ఆకుల నుంచి తయారుచేసుకున్న నూనెను ఒక గాజుసీసాలో కి వడకట్టుకోవాలి. ఇలా తయారుచేసుకున్న నూనెను తలకు రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు నల్లగా మారుతుంది. అలాగే చుండ్రు సమస్య తగ్గుతుంది.

దెబ్బ తగిలిన వెంటనే రక్తం గడ్డ కట్టడానికి ఈ ఆకులు చక్కగా పనిచేస్తాయి. దెబ్బ తగిలితే వెంటనే ఈ ఆకుల రసాన్ని పిండి గాయానికి కట్టు కట్టడం వల్ల రక్తం త్వరగా గడ్డ కడుతుంది. ఈ ఆకుల లో విటమిన్ కె సమృద్ధిగా ఉంది. అందుకే ఈ చెట్టు ఆకులు ఆయుర్వేదం లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఆకుల నుంచి తీసిన రసం ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి కషాయంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న కషాయాన్ని తాగడం వలన కాలేయ సంబంధ వ్యాధులు దరిచేరవు. అంతేకాకుండా శ్వాసకోస సమస్యల నుండి బయట పడవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker