గంజి తీసుకోవడం వల్ల నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం.
మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు గంజి నీటిలో ఉంటాయి. అందుకే గంజి నీటిని పారబోయకుండా వాటిని గోరు వెచ్చని ఉండగానే అందులో కాస్తంత ఉప్పు వేసి తాగడం వలన మనకు అనేక లాభాలు కలుగుతాయి. అయితే మన ఇళ్లల్లో అన్నం వండేటప్పుడు వచ్చే గంజి నీటిని చాలా మంది పారబోస్తుంటారు కదా అలా చేయకూడదు. గంజి నీటిలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటిని గోరు వెచ్చగా ఉండగానే చిటికెడు ఉప్పు వేసి తాగాలి.
దీంతో మనకు అనేక లాభాలు కలుగుతాయి. ఎండలో బయటికి వెల్లి ఇంటికి రాగానే దాహంతో కూల్ డ్రింక్స్ తాగేస్తుంటాం. లేదా ఏ సోడా బండి దగ్గర సోడా, చెరుకు రసమో తాగుతుంటాం. అయితే కూల్ డ్రింక్స్ తాగినా, బయట బండి మీద దొరికే చెరుకురసం లాంటివైనా అనేక రకాలుగా దుష్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. నిజానికి కూల్ డ్రింక్స్ తాగితే దాహం తీరడమేమో గానీ శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. అందుకే ఈ కూల్ డ్రింక్స్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. అయితే ఎండాకాలంలో వీటన్నింటినీ మించింది గంజి అంటున్నారు నిపుణులు.
గంజి నీటిలో B-Vitamin లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. విటమిన్ల లోపం రాకుండా చూసుకోవచ్చు. పిల్లలకు గంజి తాగిస్తే చాలా మంచిది. వారి ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. కూల్ డ్రింక్స్ లో కేలరీలు ఎక్కువ. కాని గంజిలో మాత్రం చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. గ్లాసు గంజి తాగితే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఇందుకు కారణం దీనిలో ఉండే పీచు పదార్థాలే. ఈ ఫైబర్ వల్ల కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎముకలు పటిష్టంగా ఉండాలంటే రోజూ గ్లాసెడు గంజి తాగండి.
ముఖ్యంగా మహిళలు రెగ్యులర్ గా గంజి తాగితే రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. బియ్యంతో తీసిన గంజి మాత్రమే కాకుండా ఇతరత్రా ధాన్యాలు, చిరుధాన్యాల ద్వారా తయారుచేసిన జావ వల్ల కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఇది మంచి బ్రేక్ ఫాస్ట్. దీనిలో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల శరీరంలో కొవ్వు పెరగదు. ఫైబర్ కంటెంట్ అధికం కాబట్టి తొందరగా ఆకలి వేయదు. అందుకే ప్రతిరోజూ గంజి గానీ, జావ గానీ తయారుచేసుకుని ఉదయం తాగితే మంచి పోషకాహారంగా, బరువు తగ్గించే ఫుడ్ గా పనిచేస్తుంది. ఇకనుంచీ అన్నంతో పాటు వచ్చే గంజిని పారబోయకుండా తీసుకోండి.