Gingivitis : చిగుళ్ల వాపు సమస్య వేధిస్తుంటే.. ఒకసారి దీన్ని ట్రై చెయ్యండి, వెంటనే తగ్గిపోతుంది.

Gingivitis : చిగుళ్ల వాపు సమస్య వేధిస్తుంటే.. ఒకసారి దీన్ని ట్రై చెయ్యండి, వెంటనే తగ్గిపోతుంది.
Gingivities : చిగుళ్ళ మధ్యన పాచి పేరుకుపోవడం వంటి వివిధ రకాల కారణాల వల్ల చిగుళ్ల వాపు సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య వల్ల పంటి చిగుళ్ల నుండి రక్తస్రావం కావటం, చిగుళ్లు ఎరుపెక్కి వాపు రావటం, నోటి నుండి దర్వాసన వెదజల్లటం, వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే తమలపాకు దంత సమస్యలకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
Also Read: మీకు అప్పుడప్పుడు బీపీ డౌన్ అవుతుందా..?
పంటి నొప్పి, చిగుళ్ళు వాపు, చిగుళ్ళలో రక్తస్రావం మొదలైన వాటికి చికిత్స చేయడానికి మీరు కర్పూరంతో తమలపాకును తినవచ్చు. ఇది ఉపశమనం ఇస్తుంది. పాన్ చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. యూరిక్ యాసిడ్ సమస్యను దూరం చేస్తుంది. పెరిగిన యూరిక్ యాసిడ్ తగ్గిస్తుంది. తమలపాకులను సరిగ్గా తీసుకుంటే మన శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుంది.

తమలపాకు ఆయుర్వేదంలో ఔషధంగా ముఖ్యమైనది. దీని ఆకులకు జీర్ణక్రియ గుణాలు ఉన్నాయి. పొట్టలోని బ్యాక్టీరియాను తొలగించి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. శరీరాన్ని ఆరోగ్యవంతంగా, చురుగ్గా మార్చుతుంది. తమలపాకు మన శరీరాన్ని అలర్జీ సమస్యల నుంచి కూడా కాపాడుతుంది.
Also Read: కాలేయ సమస్యలున్నవారు తరచూ చెరుకు రసం తాగితే చాలు
నోటి దుర్వాసనను నివారించడంలో కూడా తమలపాకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు మీకు నిద్రగా అనిపిస్తే, మీరు తమలపాకులు తినవచ్చు. దీని వల్ల మీ నిద్ర పోతుంది. మీరు మీ పనిని సులభంగా చేయగలుగుతారు.