ఆడపిల్లల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఉత్తమ పథకాలు ఇవే.
బాలిక యోజన పథకం 1997 నుంచి అమలులో ఉంది. స్కూళ్లలో ఆడ పిల్లల సంఖ్యను పెంచడానికి ఈ స్కీమ్‌ను తీసుకువచ్చారు. ఈ పథకం కింద ఆడ పిల్ల పుట్టిన తర్వాత అమ్మకు రూ.500 క్యాష్ గిఫ్ట్‌గా ఇస్తారు. తర్వాత ఆడ పిల్ల స్కూల్‌కు వెళ్లిన దగ్గరి నుంచి ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ అందిస్తారు. 18 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఆడపిల్లల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలని అమలు చేస్తున్నాయి.
ఈ పథకాలు దేశంలోని బాలికల సామాజిక, ఆర్థిక భద్రతకి దోహదపడుతున్నాయి. విద్య నుంచి మొదలుకొని వివాహం వరకు అన్ని పథకాలు ఉన్నాయి. ఈ పథకాల వల్ల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా తమ కుమార్తెల భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చు. కుమార్తెల ప్రయోజనాలను పరిరక్షించే ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన సుకన్య సమృద్ధి యోజన చిన్న పొదుపు పథకం.
ఇందులో కుమార్తె పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాలలోపు అకౌంట్ ఓపెన్ చేయాలి. ప్రభుత్వం ఈ పథకంపై 7.6 శాతం రాబడిని అందిస్తోంది. సంవత్సరానికి కనిష్టంగా రూ. 250 గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. కుమార్తె వివాహం కోసం పెద్దమొత్తంలో డబ్బు క్రియేట్ చేయవచ్చు. బాలికా శిశు సంక్షేమ పథకం ఈ పథకం కింద ఆడపిల్ల పుట్టిన తర్వాత రూ.500 మంజూరు చేస్తారు. పోస్టాఫీసు లేదా బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయాలి. ఇందులో పెట్టుబడిపై ప్రభుత్వం వార్షిక వడ్డీని అందిస్తుంది.
అమ్మాయికి 18 ఏళ్లు నిండినప్పుడే ఈ డబ్బులని విత్‌డ్రా చేసుకోవచ్చు. CBSE ఉడాన్ పథకం CBSE UDAN పథకం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ పథకం బాలికలకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విద్యా సౌకర్యాలను అందిస్తుంది. దీంతో పాటు వారికి స్టడీ మెటీరియల్, ప్రీలోడెడ్ టాబ్లెట్‌లు అందిస్తుంది. తద్వారా వారు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ప్రిపరేషన్‌ను పూర్తి చేయవచ్చు. ముఖ్యమంత్రి లాడ్లీ యోజన ముఖ్యమంత్రి లాడ్లీ యోజనను జార్ఖండ్ రాష్ట్రం ప్రారంభించింది. ఈ పథకం కింద కూతురి పేరు మీద ఐదేళ్లపాటు పోస్టాఫీసు పొదుపు ఖాతాలో రూ.6000 జమ చేస్తారు. ఇవి వారి చదువుకు లేదా పెళ్లికి ఉపయోగపడుతాయి.