పాతాళంలోకి బంగారం ధరలు, భారీగా తగ్గిన బంగారం ధరలు.
దేశంలో వరుసగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. వెండి, బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం హెచ్చుతగ్గులకు లోనైన ఈ రేట్లు ఈ వారం మాత్రం గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో డాలర్ బలపడుతున్న నేపథ్యంలో బుధవారం ఉదయం వరకు ఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం ధర రూ. 1310 మేర తగ్గింది. తాజా పతనంతో ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 77.380కి చేరింది.
అంతకుముందు కూడా బంగారం ధర 1000 తగ్గింది. అయితే హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 77వేల 230 రూపాయలు పలుకుతోంది. అలాగే, 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 70వేల 790గా ఉంది. ఇక, వెండి ధర కూడా తగ్గి.. ప్రస్తుతం కిలో వెండి 97వేల 900 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,380గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 70,940గా ఉంది.
అటు ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,230గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 70,790గా కొనసాగుతోంది. కాగా, ఈ ధరలు బుధవారం ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. బంగారం కోనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు చెక్ చేసుకోవడం బెటర్. ఇక లేటెస్ట్ బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.