కుప్పకూలిన వెండి, బంగారం ధరలు. ఏకంగా రూ. 6 వేలు తగ్గడంతో..!
నవంబర్ 1వ తేదీ తర్వాత వరుస సెషన్స్ లో గోల్డ్ రేట్లు డ్రాప్ అవుతున్నాయి. ఈ నెల మొదటి రోజుతో పోల్చితే నేటివరకు తులానికి రూ. 3 వేలు తగ్గింది గోల్డ్ రేటు. అదేబాటలో నేడు గోల్డ్ రేట్లు డమాల్ అన్నాయి. పసిడి ప్రయాణం మళ్ళీ రూ. 80 వేల దిగువన ఉంది. అయితే ఇన్నాళ్లుగా గోల్డ్ కొనాలని డబ్బు పోగేసుకున్న చాలా మంది ప్రస్తుత ధరల పతనంలో షాపింగ్ చేసేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో ఏపీ తెలంగాణలో తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ రేట్లను తప్పక పరిశీలించాలి. 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.13,350 తగ్గింపును చూసింది.
దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7085, ముంబైలో రూ.7085, దిల్లీలో రూ.7100, కలకత్తాలో రూ.7085, బెంగళూరులో రూ.7085, కేరళలో రూ.7085, పూణేలో రూ.7085, వడోదరలో రూ.7090, అహ్మదాబాదులో రూ.7090, జైపూరులో రూ.7100, లక్నోలో రూ.7100, పాట్నాలో రూ.7090, మంగళూరులో రూ.7085, నాశిక్ లో రూ.7088, మైసూరులో రూ.7085, అయోధ్యలో రూ.7100, బళ్లారిలో రూ.7085, గురుగ్రాములో రూ.7100, నోయిడాలో రూ.7100గా ఉన్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర 100 గ్రాములకు రూ.14,700 తగ్గుదలను చూసింది. నేడు గోల్డ్ భారీ తగ్గింపుతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను చూస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7729, ముంబైలో రూ.7729, దిల్లీలో రూ.7744, కలకత్తాలో రూ.7729, బెంగళూరులో రూ.7729, కేరళలో రూ.7729, పూణేలో రూ.7729, వడోదరలో రూ.7734, అహ్మదాబాదులో రూ.7090, జైపూరులో రూ.7744, లక్నోలో రూ.7744, పాట్నాలో రూ.7734, మంగళూరులో రూ.7729, నాశిక్ లో రూ.7732, మైసూరులో రూ.7729, అయోధ్యలో రూ.7744, బళ్లారిలో రూ.7729, గురుగ్రాములో రూ.7744, నోయిడాలో రూ.7744 వద్ద విక్రయించబడుతున్నాయి.
పైన పేర్కొన్న రేట్లకు అదనంగా తరుగు, మజూరి, జీఎస్టీ వంటి చార్జీలు ఉంటాయి. ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7085గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7729 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7085గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7729 వద్ద కొనసాగుతోంది.