గ్రీ టీ ఇలాంటి వాళ్ళు తగకపోవడమే మంచిది. ఎందుకంటే..?
మీరు అలసిపోయినట్లు అనిపిస్తే, గ్రీన్ టీ తీసుకోండి. ఈ టీలో శరీరానికి శక్తినిచ్చే కెఫిన్ చాలా ఎక్కువ. అలాగే, ఇది శరీరం, మనస్సును ఒత్తిడి తగ్గిస్తోంది. అయితే కొన్ని వ్యాపార సంస్థలు తమ వ్యాపారం పెంచుకోవడం కోసం గ్రీన్ టీ ని ఎంత ఎక్కువ వినియోగిస్తే అంత మంచిదనే ప్రకటనలు ఇస్తున్నాయి. ఇలా తీసుకోవడం దీనివల్ల మేలు కంటే నష్టం జరిగే ప్రమాదం ఎక్కువ ఉంది.
ప్రదానం గా కొన్ని ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు గ్రీన్ టీ కి దూరం గా ఉండడం చాల మంచిది. షుగర్ తో బాధపడుతున్నవారు గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. గ్రీన్ టీ రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల దురదలు, ఆందోళన, గుండెల్లో మంట ఏర్పడే అవకాశం ఉండడం వలన గ్రీన్ టీ తాగే అలవాటు ఈ రోజు నుంచే వదిలేయండి. దానికి బదులు గోరు వెచ్చని నీటిని తీసుకోవడం మంచిది. నిద్రలేమి సమస్యతో ఉన్నవారు కూడా గ్రీన్ టీ ని తాగకూడదు.
అలాగే ఇన్సోమ్నియాకు చికిత్స తీసుకుంటున్నవారు కూడా గ్రీన్ టీ తీసుకోకూడదు. గ్రీన్ టీ వల్ల డీ హైడ్రేషన్ ఎక్కువ అవుతుంది.గర్భంతో ఉన్నవారు లేదా పిల్లలకోసం ప్లాన్ చేసుకుంటున్నవారు కూడా, గ్రీన్ టీ ని అతిగా తాగొద్దు. ఇందులోని కెఫీన్ ఉద్దీపన రక్తంలోకి చాలా సులభంగా చేరుకుంటుంది. దీనివల్ల శిశువుల్లో జీవక్రియ సమస్యలు తలెత్తవచ్చు. గర్బీణీలు కెఫిన్ ద్రవాలు, పదార్థాలను తీసుకోడానికి ముందు తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది.
ఐరన్ సమస్యతో బాధపడేవారు గ్రీన్ టీ కి దూరంగా ఉండడం మంచిది . హెర్బల్ టీలు ఆహారంలోని ఐరన్‌ను గ్రహించే శక్తిని నశించే లా చేస్తాయ్. దీనివల్ల శరీరానికిఅవసరమైన ఐరన్ అందదు. దీంతో కొత్త రోగాలువస్తాయి. రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు కూడా గ్రీన్ టీ కి దూరం గా ఉండాలి. గ్రీన్‌టీలో ఉండే ఉత్తేజిత లక్షణం బీపీపై ప్రభావం కలిగిస్తుంది. అందువల్ల గ్రీన్ టీ అలవాటు ఉంటే నెమ్మ,నెమ్మదిగా తగ్గించుకోవడం ఉత్తమం.