ఈ చెట్టు ఆకులని ఇలా చేసి వాడితే జీవితంలో పక్షవాతం రానేరాదు.

గుంటకలగర లేదా గుంటగలగర ఒక విధమైన ఔషధ మొక్క. ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం ఎక్లిప్టా ఆల్బా . నీటి కాలువలు, గుంటల పక్కన, తేమగల ప్రదేశాలలో నేలబారుగా పెరిగే కలుపు మొక్క గుంటగలిజేరు. అయితే మనకు ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను ఉపయోగించి మందులు తయారు చేస్తారు. జుట్టు ఊడిపోకుండా, తెల్లబడకుండా చేయడంలో ఎన్నో ఆకులు అక్కరకు వస్తాయి. ఇందులో గుంటగలగర ఆకు ముఖ్యమైనది. జుట్టు కోసం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
దీని రసం బట్టలో వడగట్టి ముక్కులో చుక్కలుగా వేసుకుని పీలుస్తూ ఉంటే దీర్ఘకాలిక నొప్పులు తలనొప్పి, తల బరువు, మెదడు బలహీనత, చిన్న వయసులో వెంట్రుకలు రాలిపోవడం, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. దీని ఆకులు వాడుకుని ఈ మందు తయారు చేసుకోవచ్చు. దీని ఆకులు మాత్రమే వాడుకుని నూనె తయారు చేసుకుంటే వెంట్రుకలు పొడవుగా, దృఢంగా అవుతాయి. నువ్వుల నూనెతో ఈ ఆకుల మిశ్రమాన్ని కలుపుకుని వాడుకుంటే ఎంతో మంచిది.
గుంటగలగర ఆకులకు తగినంత నీరు కలిపి నూరి బట్టలో పిండి ఆ రసాన్ని నోటిలో పోసుకుని ఐదు నుంచి పది నిమిషాల పాటు పుక్కిలిస్తే నోటిపూత, నాలుక పూత, నాలుకపై పగుళ్లు, నోటిలో పుండ్లు మొదలైన సమస్యలు దూరమవుతాయి. ఐదు నుండి పది గ్రాముల ఆకుల్ని తీసుకుని కొద్దిగా ఉప్పు చేర్చి మెత్తగా నూరి అరకప్పు నీటిలో కలపాలి. దీన్ని వడబోసి వచ్చిన రసాన్ని ఉదయం సాయంత్రం రెండు పూటల భోజనానికి ముందు తాగితే కడుపు నొప్పి మాయమవుతుంది. కడుపు ఉబ్బరం, పేగులలో అలజడి తగ్గుతాయి. మలబద్ధకం సమస్య ఉండదు.
చర్మవ్యాధులకు ఇది మంచి మందులా పనిచేస్తుంది. దీని ఆకులను నీటితో మెత్తగానూరి ఆ ముద్దను గజ్జి, తామర, దద్దుర్లు, దురదలు, పుండ్లు, కురుపులు, గాయాలకు పరిష్కారం చూపుతుంది. గుంటగలగర వేళ్లు, వేళ్ల పొడి, ఇంట్లో కొట్టుకున్న పసుపు కొమ్ముల పొడి సమ పాళ్లల్లో కలిపి నిలువ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు పూటలా అరచెంచా చొప్పున వాడితే చర్మ వ్యాధులు నయం అవుతాయి. మట్టి మూకుడులో వాము వేసి అది మునిగే వరకు గుంటగలగర ఆకుల రసం పోసి రాత్రంతా నానటెట్టాలి. మరుసటి రోజు ఎండలో పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఉంటే సాయంత్రానికి రసమంతా గింజలలోకి ఇంకుతుంది.
దీన్ని బాగా ఎండబెట్టాలి తరువాత ఆ గింజలను పొడిచేసి జల్లెడపట్టి నిలువ చేసుకోవాలి. కప్పు మంచినీటిలో పావు చెంచా పొడి వేసి బాగా కలిపి రెండు పూటలా భోజనానికి గంట ముందు తాగాలి. ఇలా చేయడం వల్ల పైత్యం, ఉద్రేకం తగ్గుతాయి. కాలేయ సమస్యలు దూరమవుతాయి. అరికాళ్లు, అరిచేతుల మంటలు, దురదలు, నొప్పులు, పగుళ్లు, చర్మం ఎండిపోవడం, నల్లగా మాడిపోవడం, పెదాలు పగలడం వంటి సమస్యలు దూరం చేస్తుంది. ఇలా గుంటగలగర ఆకులతో మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని చెబుతుంటారు.