News

48 ఏళ్ల వయసులో మీనా రెండో పెళ్లి..? అసలు నిజాలు బయట పెట్టిన ఫ్రెండ్.

పెళ్లి చేసుకున్న తర్వాత మీనా ఇండస్ట్రీకి కొద్ది కాలం దూరంగా కూడా ఉంది. అయితే ఆ మధ్య తన భర్తను కోల్పోయింది మీనా. ఆ బాధ నుంచి బయటపడేందుకు మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. వరుస షూటింగ్స్​తో బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది. అయితే గతకొన్నాళ్లుగా మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇటీవల నటీ మీనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రెండో పెళ్లిపై వస్తున్న రూమార్స్ పై స్పందించారు. ‘సోషల్ మీడియా లో ఏదోకటి రాయాలి. ఏదోక విషయాన్ని హైలైట్ చేయాలని కొంతమంది ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు.

తమిళ్ హీరో థనుష్ తో ఇతర హీరోలతో ట్యాగ్ చేస్తూ.. పిచ్చి పిచ్చి వార్తలు రాస్తున్నారు. మొయిన్ గా హీరో థనుష్ తో పెళ్లి చేసుకోబోతుంది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆయన సింగల్ గా ఉన్నారని అలా రాస్తున్నారు. అతడే కాకుండా.. ఇండస్ట్రీలో చాలా మంది సింగల్ గా ఉన్నారు. వాళ్లతో కూడా కలిసి వార్తలు రాసేలా ఉన్నారు. వార్తలు లేకపోతేనే ఇలాంటి రూమార్స్ క్రియేట్ చేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మీనా ఇంకా మాట్లాడుతూ ..’నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.. ప్రతి వారితోనూ ఫ్రెండ్లీ గానే ఉంటాను.

లేనిపోని విషయాలు ఎందుకు రాస్తున్నారు? రాసే ముందు ఒక్క మాట నన్ను అడగవచ్చు కాదా? నేను ఏమైనా నిర్ణయం తీసుకుంటే.. మీడియాకు చెపుతా కాదా? అని ప్రశ్నించారు. ‘నా జీవితం తెరిచిన పుస్తకం. నా జీవితంలో నటించి సినిమాలు, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ప్రతి విషయం అందరికి తెలుసు. నేను ఎన్నో సంవతర్సాలుగా ఇండస్ట్రీలో ఉన్నా.. నా జీవితం, నా కేరిర్ గురిచి అంతా తెలిసినా ఇలా ‘ అంటూ ఎమోషనల్ అయ్యారు. జీవితంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేను. నా భర్త చనిపోతాడని ఏ క్షణంలో కూడా ఊహించలేదు. నా జీవితంలో ఏం జరగాలో అది జరిగిపోతుంటుంది.

ఇది చేయాలి.. అది చేయాలి అని ప్లాన్ చేసుకొంటే కుదరదు. నా లైఫ్‌లో కూడా అంతే.. నేను ప్రస్తుతం దేని గురించి ఆలోచించడం లేదు. సాధ్యమైనంత వరకు ఒంటరిగానే జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తాను. నాకు ఓ కూతురు ఉంది. నా కూతురు నైనిక విద్యాసాగర్ భవిష్యత్ నాకు ముఖ్యం. నా జీవితంలో ఏం జరిగితే .. అలా నేను ముందుకు సాగుతాను ‘ అని మీనా అన్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker