క్యాన్సర్‌ను పూర్తిగా జయించిన హంసానందిని. ఇప్పుడు ఎలా ఉందంటే..?
వంశపారంపర్యంగా ఆమె బ్రెస్ట్ కేన్సర్ బారిన పడడం గమనార్హం. 2021 డిసెంబర్ లో ఈ కఠిన నిజాన్ని ఇన్ స్టా గ్రామ్ లో ఆమె బయటపెట్టింది. తొమ్మిది సైకిల్స్ కీమోథెరపీ తీసుకున్నానని, మరో ఏడు సైకిల్స్ తీసుకోవాల్సి ఉన్నట్టు వెల్లడించింది. ఓ సినిమా షూటింగ్ కు హాజరైన హంసానందిని తన తాజా ఆరోగ్య స్థితిని వివరించింది.
అయితే ఈ అందాల తార 2021 డిసెంబర్‌లో ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను క్యాన్సర్ బారిన పడినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటికే కీమోథెరపీ చికిత్స చేయించుకుంటున్నట్లు చెప్పిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక శుభవార్త చెప్పింది. సుమారు ఏడాదిగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె 16 సైకిల్స్ కీమోథెరపీ తర్వాత విజయవంతంగా కోలుకున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నానన్న హంసా నందిని తిరిగి షూటింగ్‌లోనూ పాల్గొనడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ‘సినిమా సెట్లో ఉంటే ఆ అనుభూతే వేరు. ఇది నాకు మరో పునర్జన్మ లాంటిది. కెమెరా ముందు సజీవంగా ఉండే చోట నా పుట్టిన రోజు రావడం మంచి మార్గమని తెలుసు.
ఈ రోజు రాత్రి నా తోటి నటులు, సినిమా సిబ్బందితో బర్త్ డే వేడుకలు జరుపుకుంటాను. ఇలాంటి సందర్భాన్ని ఎలా మిస్ అవుతాను? అభిమానుల ప్రేమ, ఆప్యాయతల వల్లే నేను కోలుకుని రాగలిగాను. అందరికీ కృతజ్ఞతలు. ఐ యామ్ బ్యాక్’ అని తన ఆనందాన్ని పంచుకుంది హంసానందిని. కాగా సుమారు 19 ఏళ్ల క్రితం హంసానందిని తల్లి కూడా క్యాన్సర్‌తో కన్నుమూసింది.