అరచేతిలో ఈ గీతలు ఉంటె అదృష్టవంతులే, జీవితంలో సంపద, పేరు, కీర్తి వీరి సొంతం.
వ్యక్తి జాతకం అరచేతిలోని గుర్తులు, రేఖలను అధ్యయనం చేయడం ద్వారా కూడా అతని భవిష్యత్తు గురించి చాలా విషయాలు చెబుతారు. హస్తసాముద్రికం ప్రకారం.. జీవిత రేఖ, విధి రేఖ, వివాహ రేఖ, చైల్డ్ లైన్ , డబ్బు సంబంధిత రేఖలు ఒక వ్యక్తి అరచేతిపై దర్శనమిస్తాయి. ఇవే కాదు.. అనేక రకాల గుర్తులు కూడా కనిపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రేఖలు చేతిలో ఉన్న వారి జీవితంలో.. భౌతిక సుఖాలు, ఐశ్వర్యం నిండి ఉంటుంది.
జీవితాంతం ఆనందానికి, శ్రేయస్సుకు ఎలాంటి లోటు ఉండదు. అయితే మనదేశంలో జ్యోతిష్యాన్ని నమ్ముకుంటాం. న్యూమరాలజీ ప్రకారం మన జాతకం ఎలా ఉందని తెలుసుకుంటాం. మన చేతి మీద ఉన్న రేఖలు ఎలా ఉంటాయి. వాటి వల్ల మనకు ఏం జరుగుతుంది. ఎలాంటి ఫలితాలు వస్తాయి. అనే దానిపై అందరికి ఆసక్తి ఉంటుంది. అరచేతిలో ఉండే రేఖలను బట్టే మన జాతకం ఉంటుంది.
అందుకే రేఖల ఆధారంగా మన అదృష్టం ముడిపడి ఉంటుంది. ఎం అనే ఆంగ్ల అక్షరం.. అరచేతిలో ఎం అనే ఆంగ్ల అక్షరం ఆకారంలో రేఖలు ఉంటే మంచిదని చెబుతుంటారు. ఇలాంటి వారికి హస్త సాముద్రికం చాలా ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. అరచేతిలో ఎం అనే ఆంగ్ల అక్షరంతో రేఖలు కనిపిస్తే వారిలో గుణాలు బాగుంటాయని పంచాంగం వివరిస్తోంది. వారి జీవితం మంచి దిశగా ప్రయాణిస్తుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
అదృష్టవంతులు.. అరచేతిలో ఎం అనే ఆంగ్ల అక్షరంలో గీతలు ఉంటే వారు అదృష్టవంతులు అవుతారు. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. జీవితంలో అత్యంత క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తారు. అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వీరి ప్రత్యేకత. అందుకే వీరు జీవితంలో సానుకూలంగా ప్రవర్తిస్తారు.
చేతివాటం..ఎడమ చేతి వాటం ఉన్న వారికి కుడిచేతిలో కుడి చేతివాటం ఉన్న వారికి ఎడమ చేతిలో ఎం అనే అక్షరంలా రేఖలు ఉండటం వల్ల మంచి జరుగుతుంది. ఈనేపథ్యంలో మన చేతిలోని రేఖలను చూసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో హస్త సాముద్రికం చెబుతోంది. మనం చేతలోని రేఖల ఆధారం మన భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుస్తుంది.