నటాషాతో విడాకుల రూమర్లు, కొత్త హాట్ బ్యూటీతో హార్దిక్ పాండ్యా. ఈ బ్యూటీ ఎవరో తెలుసా..?
హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ గెలిచినా అతని భార్య నటాషా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ చేయలేదు. దీంతో పాండ్యా దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తేల్చేశారు కొందరు నెటిజన్లు. త్వరలో వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే రానున్న రోజుల్లో పాండ్యా దంపతులు విడాకులు తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని వార్తలు వస్తున్నాయి. అయితే సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ తో విడాకుల పుకార్ల మధ్య హార్దిక్ పాండ్యా ఒక మిస్టరీ గర్ల్‌తో కనిపిస్తున్న ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గత కొన్ని రోజులుగా, క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్ లు ఇప్పుడు విడిపోయారని ఊహాగానాలు ఉన్నాయి. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి పాండ్యా పేరును తొలగించిందని ఒక యూజర్ పేర్కొనడంతో సోషల్ మీడియాలో వీరిద్దరి విడాకుల అంశం హాట్ టాపిక్ గా మారింది. అనేక పుకార్లు మొదలయ్యాయి. దీనికి తోడు వీరు గత కొన్ని వారాలుగా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఫొటోలను కూడా పంచుకోవడం లేదు. దీంతో విడాకులు తీసుకున్నారని చర్చసాగింది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో “ఎవరో వీధుల్లోకి రాబోతున్నారు” అనే క్యాప్షన్‌తో ట్రాఫిక్ గుర్తుల చిత్రాన్ని పంచుకున్నారు.
ఈ జంట విడిపోయినట్లు ఊహాగానాలు వచ్చిన తర్వాత హార్దిక్ తన నికర విలువలో 70% నటాసాకు బదిలీ చేయాల్సి ఉంటుందనే వార్తలు కూడా వచ్చాయి. దీని తర్వాత కూడా పలు మిస్టీరియస్ పోస్టులను పంచుకుంది. ఇలాంటి సమయంలో హార్ధిక్ పాండ్యా ఇప్పుడు ఒక మిస్టరీ గర్ల్ తో కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నటాషాతో విడిపోయే అవకాశం ఉందనే ఊహాగానాల మధ్య హార్దిక్ పాండ్యా ఒక మిస్టరీ గర్ల్‌తో తాజాగా పంచుకున్న వీడియో వైరల్ గా మారింది. ఇది పాండ్యా అభిమానులతో పాటు సోషల్ మీడియాలో మరో హాట్ టాపిక్ అయింది. ఈ వీడియోలో హార్దిక్ హార్దిక్ పాండ్యా చాలా సంతోషంగా కనిపించాడు.
హార్దిక్ తో పాటు ఉన్నది ఎవరో కాదు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ప్రాచీ సోలంకి. పాండ్యా ఆమెను పట్టుకుని ఫోటోలకు పోజులిచ్చాడు. ప్రాచీ తన సోదరుడు కృనాల్ పాండ్యాతో సహా హార్దిక్ కుటుంబంతో ఫోటోలను కూడా పంచుకుంది.