తలనొప్పితో బాధపడుతున్నారా..? వెంటనే ఈ విషయాలు తెలుసుకోండి.
తలనొప్పి అనేది తల లేదా మెడ ప్రాంతంలో ఎక్కడో చోట ఉండే నొప్పి. ఇది తల, మెడ యొక్క వివిధ పరిస్థితుల యొక్క ఒక రోగలక్షణం అయ్యుండవచ్చు. పైగా ఈ నొప్పి మెదడు చుట్టూ పెయిన్-సెన్సిటివ్ నిర్మాణాల యొక్క కలతకు కారణమవుతుంది. అయితే నుదుటిలో నొప్పి.. కొంతమందికి నుదుటి భాగంలో నొప్పి వస్తుంది. ఇది నిద్ర లేమికి సంకేతం. ఈ రకమైన తలనొప్పిలో.. మీకు నుదిటిలో కత్తిపోటు పొడిచినంత నొప్పి కలుగుతుంది.
ఈ రకమైన తలనొప్పి వచ్చినప్పుడు కొన్ని గంటలు బాగా నిద్రపోవాలి. పడుకుంటే ఈ తలనొప్పి తగ్గిపోతుంది. ఈ రకమైన తలనొప్పి తగ్గాలంటే రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. తల పై భాగంలో నొప్పి.. తల పై భాగంలో కూడా విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ రకమైన తలనొప్పి మీరు తినకపోయినప్పుడు అంటే శరీరంలో శక్తి లేకున్నా.. బాడీ డీహైడ్రేషన్ బారిన పడినా.. వస్తుంది. ఈ రకమైన తలనొప్పి వస్తే.. కడుపు నిండా తినండి. పుష్కలంగా నీటిని తాగండి.
తల వెనుక భాగంలో నొప్పి.. కొన్ని కొన్ని సార్లు తల వెనుక భాగంలో కూడా మెడకు కొంచెం పైన నొప్పి కలుగుతుంది. ఇలాంటి నొప్పి వస్తుందంటే మీరు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని అర్థం. ఇలాంటి సందర్భంలో ఒత్తిడిని పెంచే పనులను గానీ, ఆలోచనలు గానీ చేయకూడదు. ప్రతిరోజూ ధ్యానం చేయడంతో పాటుగా లోతైన శ్వాస వ్యాయామాలను చేస్తే.. ఇలాంటి తలనొప్పి తగ్గుతుంది. ముక్కు, కళ్ళ చుట్టూ నొప్పి.. కనుబొమ్మల మధ్య, ముక్కు, కళ్ళ చుట్టూ నొప్పి ఉంటే.. అది అలెర్జీ లేదా సైనస్ సమస్య వల్ల కావొచ్చు. దీనినే సైనస్ తలనొప్పి అంటారు.
దీనిని తగ్గించుకోవడానికి మెడిసిన్స్ ను వాడొచ్చు. అయితే వ్యాయామం చేసినా.. వెచ్చని నీళ్లతో స్నానం చేసినా కొంతవరకు ఈ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. తీవ్రమైన తలనొప్పి..మీ నుదిటి చుట్టూ గట్టిగా ఏదో బిగించినట్టు తలనొప్పి వస్తే.. మీరు మొబైల్స్, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని అర్థం చేసుకోండి. ఈ రకమైన తలనొప్పిని తగ్గించుకోవడానికి మీరు స్క్రీన్ ను చూసే సమయాన్ని తగ్గించుకోవాలి.
స్క్రీన్ ను చూసే సమయాన్ని తగ్గించుకుంటేనే ఇలాంటి తలనొప్పి వచ్చే అవకాశం తగ్గుతుంది. అయితే మొబైల్స్, టీవీ, కంప్యూటర్లను చూసే టప్పుడు బ్లూ-రే బ్లాకర్ అద్దాలను పెట్టుకోండి. వేడి స్నానం చేసినా.. ఇలాంటి తలనొప్పి తగ్గుతుంది. కంటి చుట్టూ నొప్పి.. కొందరికి కంటి చుట్టూ భరించలేని నొప్పి వస్తుంది. మీకు క్లస్టర్ తలనొప్పి ఉందని అర్థం చేసుకోండి. ఇలాంటి తలనొప్పి వచ్చినప్పుడు కంటిలో కొంత ఎరుపు రంగు ఉంటుంది. ఇలాంటి తలనొప్పి వచ్చినప్పుడు మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.