తలనొప్పి తీవ్రంగా బాధిస్తోందా..? ఇలా చేస్తే నిమిషాల్లోనే ఉపశమనం లభిస్తుంది.
ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. శబ్దాలు వినబుద్ధి కాదు, వెలుతురు చూడబుద్ధి కాదు. ప్రయాణం చేసినా, ఎండలో ఎక్కువగా తిరిగినా, భోజనం ఆలస్యమైనా లేక అస్సలు తినకపోయినా, నిద్ర తక్కువైనా లేక మరీ ఎక్కువైనా.. ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ ఈ రకం తలనొప్పి రావచ్చు. కొన్ని కుటుంబాలలో వంశపారపర్యంగా కూడా తలనొప్పి వస్తుంది.
అయితే ఎక్కువగా మొబైల్స్ , టీవీ, ల్యాప్ ట్యాప్ వంటివి చూడడం వల్ల ఇది ఎక్కువగా వస్తుంది. మనం తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే మాత్రలు వేసుకుంటాం. అలా ప్రతి సారి టాబ్లెట్స్ వాడడం వలన అప్పటికి అప్పుడే ఉపశమనం పొందవచ్చు. కానీ శాశ్వత పరిష్కారం పొందలేము. అలా టాబ్లెట్స్ వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి కి శాశ్వత పరిష్కార నియమాలు.. ప్రతిరోజు మనం రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లను త్రాగడం వలన శాశ్వతంగా తలనొప్పి రాకుండా నివారించవచ్చు.
ఇలా నీరుని త్రాగడం వలన మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ టాయిలెట్స్ రూపంలో బయటకు వెళ్లిపోతాయి. అందువల్ల మనకి తలనొప్పి వచ్చే అవకాశం ఉండదు. మెగ్నీషియం లోపం ఉన్నవారిలో తరచూ మైగ్రేన్, తలనొప్పి ఎక్కువగా వస్తుంది. మీ డైట్ లో ఆకుకూరలు, ఆకుపచ్చ కూరగాయలు, నట్స్,చిరుధాన్యాలు , డార్క్ చాక్లెట్స్ ఎక్కువగా తీసుకోండి.
ఒక గ్లాస్ వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గోరు వెచ్చని పాలు త్రాగిన , అల్లాన్ని నమిలినా తలనొప్పి తగ్గుతుంది. మీ ఇంట్లో గంధం పౌడర్ ఉంటే పేస్ట్ లా చేసుకుని తలకు రాసుకోండి. తలనొప్పి ఎక్కువగా ఉంటే వెలుగు తక్కువగా ఉండే ప్రాంతంలో రెస్ట్ తీసుకోండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎంతటి తలనొప్పైనా సరే పోతుంది.