Heart Attack: చిన్నపిల్లల్లో గుండె పోటు వచ్చే లక్షణాలు ఇవే, వెంటనే అలెర్ట్ అవ్వకపోతే..!

Heart Attack: చిన్నపిల్లల్లో గుండె పోటు వచ్చే లక్షణాలు ఇవే, వెంటనే అలెర్ట్ అవ్వకపోతే..!
Heart Attack: చిన్నవారి నుంచి పెద్దవారి వరకు గుండెపోటుతో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జీవన విధానంలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఇందుకు ముఖ్య కారణాలు. అయితే, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా గుండె జబ్బుల రాకను తగ్గించవచ్చు. అయితే చిన్న పిల్లల్లో గుండె పోటు వచ్చే ముందు కొన్ని రకాల లక్షణాలు అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయి. కానీ పెద్దలు వాటిని సరిగా గమనించడం లేదు. పెద్దలు కూడా పిల్లల ఆరోగ్యంపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. పెద్దల్లో వచ్చే లక్షణాలు చిన్న పిల్లల్లో వచ్చే లక్షణాలు అనేవి వేరుగా ఉంటాయి.
Also Read: ఈ చూర్ణంతో మీ పేగు, కాలేయంలో పేరుకుపోయిన చెత్త మొత్తం క్లీన్ అవుతుంది.
ముఖ్యంగా పదేళ్లు పూర్తిగా నిండని పిల్లలు కూడా గుండె పోటుతో మరణించడం అనేది ఈ మధ్య కాలంలో ఎంతో మందిని కలిచి వేస్తుంది. పిల్లల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే అలెర్ట్ అవ్వాలని సూచిస్తున్నారు. అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, అలసట, ఛాతీలో అసౌకర్యం, కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండెలో దడ, చెమటలు ఎక్కువగా పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలెర్ట్ అవ్వాలి.

కేవలం తల్లిదండ్రులే కాకుండా స్కూల్‌లోని ఉపాధ్యాయులు సైతం పిల్లలు ఎలా ఉన్నారన్నది గమనించాలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలో హార్ట్ ఎటాక్ రాకుండా ఉండేందుకు చిట్కాలు:- పిల్లల్లో గుండె పోటు రాకుండా ఉండేందుకు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లల్ని కాపాడుకోవచ్చు. పిల్లలు తీసుకునే ఆహారంపై జాగ్రత్త వహించాలి. పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తినేందుకు ఇష్ట పడుతూ ఉంటారు. కాబట్టి ఆరోగ్యమైన ఆహారం పెట్టండి. ప్రతి రోజూ వాకింగ్ లేదా ఇతర శారీరక శ్రమ చేసేలా చూసుకోండి.
Also Read: రాత్రి బట్టలు లేకుండా నిద్రపోతే ఎన్ని లాభాలో తెలుసా..?
ఇది వారిని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఆహారంలో ఫైబర్, విటమిన్లు, ప్రోటీన్, ఖనిజాలు ఉండేలా చూడండి. ఇది పోషకాహార లోపాన్ని తగ్గిస్తుంది. పిల్లలకు తక్షణ శక్తిని ఇస్తుంది. పిల్లలు ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండేలా చూడాలి. కాబట్టి పానీయాలు, మంచినీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు కూడా ఇస్తూ ఉండాలి. వాళ్లు నీరసంగా ఉంటే.. వెంటనే వైద్యుల్ని సంప్రదించి.. సరైన చికిత్స చేయించాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఇవ్వండి.