తిన్న తర్వాత గుండెల్లో మంటగా ఉంటుందా..? అసలు విషయమేంటంటే..?
నూనెలో వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఇవి తొందరంగా జీర్ణం కావు.. ముఖ్యం బయట దొరికే బజ్జీలు, మిర్చిలు వంటివి జీర్ణక్రియకు హాని కలిగిస్తాయి. అలాగే మసాల వాడకాన్ని తగ్గించాలి. పచ్చి మిరపకాయలు.. మిరియాలు ఉపయోగించడం పూర్తిగా తగ్గించాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగానే ఉంటాయి… కానీ అవి అజీర్ణం కలిగిస్తాయి. అంతేకాకుండా.. గుండెలో మంటకు కారణమవుతాయి. అయితే ప్రస్తుతం కాలంలో మసాలాలు, కారం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినేవారిలో జీర్ణ సంబంధ సమస్యలు వస్తున్నాయి.
ఎసిడిటీ, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులు ఉన్నారు డాక్టర్‌ని సంప్రదించి.. తాత్కాలిక ఉపశమనం కోసం మందులు తీసుకుంటున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు తినొద్దు..ప్యాకేజ్డ్ ఫుడ్ మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. చిప్స్, చాక్లెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఉండే సంతృప్త కొవ్వు, సోడియం, ఉప్పు … బాడీలో యాసిడ్ రిఫ్లక్స్‌ను పెంచుతుది. వీటిని ఎక్కువగా తింటే.. ఎసిడిటీ పెరుగుతుంది.
అందవల్ల ఎంత తక్కువగా తింటే..అంత మంచిది. కెఫిన్‌కి దూరంగా ఉండాలి.. మీకు గుండెల్లో మంటగా అనిపిస్తే.. కెఫిన్ కలిగి ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. అంటే టీ, కాఫీలను తగ్గించాలి. మీరు ఏ ఆహారం తీసుకున్నా.. అది సమతుల్యంగా, తక్కువ మసాలా దినుసులు ఉండేలా చూసుకోవాలి. ఊబకాయంతో బాధపడుతున్నట్లయితే.. మీకు ఈ సమస్య ఎక్కువగా ఉండవచ్చు.
అందువల్ల బరువు తగ్గించుకోవడంపై దృష్టి సారించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. బాగా వ్యాయామం చేయాలి. ఒకేసారి ఎక్కువ ఆహారం తినకూడదు..మీ శరీరంలో యాసిడ్ రిఫ్లక్స్ పదేపదే జరుగుతుంటే… మీరు ఒకేసారి ఎక్కువ ఆహారం తినకూడదు. ఒకేసారి ఎక్కువ మోతాదులోఆహారం తింటే.. అది సరిగ్గా జీర్ణం కాక.. యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. అందువల్ల ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా.. రెండు మూడు సార్లు.. తక్కువ మొత్తంలో తీసుకోవడం ఉత్తమం.
ఆపిల్ వెనిగర్‌తో ఉపశమనం.. యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడుతున్న వారు.. భోజనంలో 1 టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసుకోవాలి. ఇది ఛాతీలో మంటను తగ్గించడంలో బాగా సాయపడుతుంది. తిన్న వెంటనే నిద్రపోకూడదు..తిన్న వెంటనే పడుకోవడం మంచి అలవాటు కాడు. ఇది మీ జీర్ణక్రియ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. రాత్రి భోజనం ఎప్పుడూ నిద్రకు 3 గంటల ముందే తినాలి. భోజనం చేసిన తర్వాత.. 15 నిమిషాల పాటు నడవాలి.