గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే.. ఖచ్చితంగా ఫ్రూట్ తినాల్సిందే.
ఆరోగ్యం బాగుండాలంటే వివిధ రకాల పండ్లను తినాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు. పండ్లు తినడం వల్ల శరీరానికి అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. దాదాపు అవన్నీ ఒకే ఒక్క చోట దొరికే పండు డ్రాగన్. ఈ ఫ్రూట్ తింటే ఆరోగ్యం మన వెంటే అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఈ పండును ఇటీవల ప్రతి పట్టణంలోనూ, ప్రతి నగరంలోనూ లభిస్తున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ గులాబీ రంగులో ఉంటుంది. లోపల తెల్లటి గుజ్జు.. అందులో నల్లటి విత్తనాలు ఉంటాయి. అయితే డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
వీటితో పాటు ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫైబర్ మెండుగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతాయి. ఇన్సులిన్ రెస్టిసెన్స్‌ను పెంచుతుంది. డయాబెటిస్ లేని వారు, డ్రాగన్ ఫ్రూట్ తింటే షుగర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ తినటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్, లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ తగ్గుతాయి.
డ్రాగన్ ఫ్రూట్ గుండెను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలలో ఒమేగా -3, ఒమేగా -9 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. హెచ్‌డీఎల్ గుండె ఆరోగ్యానికి మంచిది. ఒక కప్పు డ్రాగన్ ఫ్రూట్ గుజ్జు నుంచి సుమారు 136 కేలరీలు అందుతాయి. అలాగే 29 శాతం పిండిపదార్థం, 3 గ్రా మాంసకృత్తులు, 7 గ్రా పీచు, 8 శాతం ఇనుము ఉంటాయి. ఇది జీరో ఫ్యాట్ ను కలిగి ఉంటుంది.
డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటిట్యూమర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మహిళలను రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్ పేషెంట్స్ డ్రాగన్ ఫ్రూట్ తింటే, వారికి కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్లు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీని వల్ల తెల్ల రక్తకణాలు దెబ్బతినకుండా ఉంటాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్, మూర్ఛ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.